Share News

ఒక్కో వసతి గృహానికి రూ.50 వేలు

ABN , Publish Date - Feb 04 , 2026 | 02:10 AM

సంక్షేమ వసతి గృహాల్లో మరుగుదొడ్ల నిర్మాణానికి రూ.50 వేలు చొప్పున విడుదల చేస్తున్నట్లు కలెక్టర్‌ సుమిత్‌కుమార్‌ తెలిపారు.

ఒక్కో వసతి గృహానికి రూ.50 వేలు
జిల్లా అధికారులతో సమీక్షిస్తున్న కలెక్టర్‌ సుమిత్‌ కుమార్‌

మౌలిక వసతుల కల్పనకు కేటాయించామన్న కలెక్టర్‌

చిత్తూరు కలెక్టరేట్‌, ఫిబ్రవరి 3 (ఆంధ్రజ్యోతి): సంక్షేమ వసతి గృహాల్లో మరుగుదొడ్ల నిర్మాణానికి రూ.50 వేలు చొప్పున విడుదల చేస్తున్నట్లు కలెక్టర్‌ సుమిత్‌కుమార్‌ తెలిపారు. మంగళవారం కలెక్టరేట్‌లోని వీడియో కాన్ఫరెన్స్‌ హాలులో సంక్షేమ, పంచాయతీరాజ్‌, సర్వశిక్షాభియాన్‌ తదితర శాఖల అధికారులతో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. వసతిగృహ ప్రాంగణంలో సోలార్‌ లైటింగ్‌, కిచెన్‌ గార్డెన్‌, ఆర్వో ప్లాంట్‌, నిరంతర విద్యుత్‌ సౌకర్యం ఉండేలా చర్యలు చేపడుతున్నట్లు వివరించారు. వసతిగృహాల్లోని కొరతలపై నివేదికల రూపంలో ఈనెల 6వ తేదీలోపు అందిస్తే, అందుకు తగిన విధంగా నిధులు మంజూరు చేస్తామని స్పష్టం చేశారు. ఎక్కడా వ్యర్థాలు, నీటి నిల్వలు, అపరిశుభ్రత లేకుండా చూడాలని ఆదేశించారు. హాస్టళ్లలో విద్యుత్‌ ఆదా కోసం ఆరు కిలో వాట్ల సామర్థ్యం కలిగిన సౌర రూఫ్‌టాప్‌ పవర్‌ సిస్టం ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఈ సమావేశంలో జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ అధికారి విక్రమ్‌ కుమార్‌ రెడ్డి, గిరిజన సంక్షేమశాఖ అధికారి మూర్తి, డీపీవో సుధాకర్‌రావు, ఆర్‌అండ్‌బీ ఎస్‌ఈ ప్రసన్నకుమార్‌, పీఆర్‌ ఈఈ నవీన్‌, ఎస్‌ఎ్‌సఏ పీవో వెంకటరమణ, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.

Updated Date - Feb 04 , 2026 | 02:10 AM