6న వైఎస్ షర్మిల రాక
ABN , Publish Date - Feb 04 , 2026 | 02:09 AM
కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఈనెల 6వ తేదీన జిల్లాలో పర్యటించనున్నట్లు ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు రమేష్ బాబు చెప్పారు.
పలమనేరులో రచ్చబండ.. జీడీ నెల్లూరులో బహిరంగ సభ
చిత్తూరు సిటీ, ఫిబ్రవరి 3 (ఆంధ్రజ్యోతి): కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఈనెల 6వ తేదీన జిల్లాలో పర్యటించనున్నట్లు ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు రమేష్ బాబు చెప్పారు. చిత్తూరు ప్రెస్‌క్లబ్‌లో మంగళవారం ఆయన ఆ పార్టీ నేత టిక్కీ రాయల్‌తో కలిసి మీడియాతో మాట్లాడారు. కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం అంచెలంచెలుగా మహాత్మగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేసేందుకు కుట్ర పన్నుతోందని ఆరోపించారు. ఉపాధి హామీ చట్టాన్ని మహాత్మ గాంధీ పేరిట కొనసాగించాలని కోరుతూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో యాత్ర జరుగుతోందన్నారు. ఇందులో భాగంగా వైఎస్ షర్మిల 6వ తేది ఉదయం పలమనేరులో రచ్చబండ కార్యక్రమంలో పాల్గొని రైతులతో మాట్లాడతారన్నారు. మధ్యాహ్నం గంగాధరనెల్లూరులో జరిగే బహిరంగ సభలో పాల్గొంటారని వివరించారు. ఈ కార్యక్రమాలకు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, రైతు కూలీలు, ప్రజలు హాజరై విజయవంతం చేయాలని కోరారు.