ఎస్వీయూ డిగ్రీ పరీక్ష కేంద్రం మార్పు
ABN , Publish Date - Feb 04 , 2026 | 02:20 AM
ఎస్వీయూనివర్సిటీ పరిధిలో గురువారం నుంచి డిగ్రీ మొదటి సెమిస్టర్ పరీక్షలు నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించి పద్మావతి మహిళా డిగ్రీ కళాశాలలో పరీక్ష కేంద్రాన్ని కేటాయించారు.
తిరుపతి (విశ్వవిద్యాలయాలు), ఫిబ్రవరి 3 (ఆంధ్రజ్యోతి): ఎస్వీయూనివర్సిటీ పరిధిలో గురువారం నుంచి డిగ్రీ మొదటి సెమిస్టర్ పరీక్షలు నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించి పద్మావతి మహిళా డిగ్రీ కళాశాలలో పరీక్ష కేంద్రాన్ని కేటాయించారు. అయితే, ఈ కాలేజీని ఏపీపీఎస్సీ పరీక్షల నిర్వహణకు ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. దాంతో ఈ కాలేజీలో డిగ్రీ మొదటి సెమిస్టర్ పరీక్ష రాయాల్సిన విద్యార్థులను ఎమరాల్డ్స్, గాయత్రి కాలేజీల్లో ఏర్పాటు చేసిన కేంద్రాలకు మార్చారు. విద్యార్థులు ఈ మార్పును గుర్తించాలని వర్సిటీ పరీక్షల డీన్ సురేంద్రబాబు, సీఈ డాక్టర్ రాజమాణిక్యం కోరారు.