Share News

ప్రత్యేక అవసరాల పిల్లలకు డిజిటల్‌ లెర్నింగ్‌

ABN , Publish Date - Feb 04 , 2026 | 02:08 AM

సమగ్ర శిక్ష ఆధ్వర్యంలోని భవిత కేంద్రాల్లో చదువుతున్న ప్రత్యేక అవసరాల పిల్లలకు ఇకపై డిజిటల్‌ లెర్నింగ్‌ నేర్పించాలని దృష్టి యాప్‌ స్టేట్‌ కీ రిసోర్స్‌ పర్సన్‌ టీం సభ్యులు వైరముత్తు, వైషాఖ్‌ పేర్కొన్నారు.

ప్రత్యేక అవసరాల పిల్లలకు డిజిటల్‌ లెర్నింగ్‌
దృష్టి యాప్‌ స్టేట్‌ కీ రిసోర్స్‌ పర్సన్‌ టీం సభ్యులతో భవిత టీచర్లు

చిత్తూరు సెంట్రల్‌, ఫిబ్రవరి 3(ఆంధ్రజ్యోతి): సమగ్ర శిక్ష ఆధ్వర్యంలోని భవిత కేంద్రాల్లో చదువుతున్న ప్రత్యేక అవసరాల పిల్లలకు ఇకపై డిజిటల్‌ లెర్నింగ్‌ నేర్పించాలని దృష్టి యాప్‌ స్టేట్‌ కీ రిసోర్స్‌ పర్సన్‌ టీం సభ్యులు వైరముత్తు, వైషాఖ్‌ పేర్కొన్నారు. సమగ్రశిక్ష ఏపీసీ వెంకటరమణ, భవిత కేంద్రాల జిల్లా సమన్వయకర్త మధు సంయుక్త ఆధ్వర్యంలో దృష్టి యాప్‌ ఎలా వినియోగించాలనే దానిపై భవిత కేంద్రాల టీచర్లకు మంగళవారం శిక్షణ ఇచ్చారు. ప్రత్యేక అవసరాల పిల్లలకు ఇస్తున్న శిక్షణ, అవసరాలు, థెరపీ, డిజిటల్‌ బోధన, కేస్‌ స్టడీస్‌, కేరీర్‌లో చేపట్టే ప్రక్రియలను దృష్టి యాప్‌లో అప్‌లోడ్‌ చేయాలన్నారు. కార్యక్రమంలో జిల్లాలోని 27 భవిత కేంద్రాల టీచర్లు పాల్గొన్నారు.

Updated Date - Feb 04 , 2026 | 02:08 AM