1143 మట్టి నమూనాల సేకరణ
ABN , Publish Date - Feb 04 , 2026 | 02:06 AM
నేషనల్ మిషన్ ఆన్ నేచురల్ ఫార్మింగ్ (ఎన్‌ఎంఎన్‌ఎ్‌ఫ)లో భాగంగా మంగళవారం జిల్లా వ్యాప్తంగా 1143 మట్టి నమూనాలు సేకరించినట్లు ఎన్‌ఎంఎన్‌ఎ్‌ఫ జిల్లా ప్రాజెక్టు మేనేజర్ శివశంకర్ తెలిపారు.
చిత్తూరు సెంట్రల్, ఫిబ్రవరి 3(ఆంధ్రజ్యోతి): నేషనల్ మిషన్ ఆన్ నేచురల్ ఫార్మింగ్ (ఎన్‌ఎంఎన్‌ఎ్‌ఫ)లో భాగంగా మంగళవారం జిల్లా వ్యాప్తంగా 1143 మట్టి నమూనాలు సేకరించినట్లు ఎన్‌ఎంఎన్‌ఎ్‌ఫ జిల్లా ప్రాజెక్టు మేనేజర్ శివశంకర్ తెలిపారు. జిల్లా వ్యాప్తంగా ఈ ఏడాది 16,401 మట్టి నమూనాలు లక్ష్యం కాగా, రోజువారి కనీసం 584 మట్టి నమూనాలు సేకరించుకోవాలని లక్ష్యాన్ని నిర్దేశించుకున్నట్లు చెప్పారు. మట్టి నమూనాలు సేకరించడంతో పాటు రైతుల వివరాలు పూర్తి స్థాయిలో నమోదు, పంట సాగు రకాలు, సేంద్రియ పద్ధతుల్లో వ్యవసాయ చేయడం ద్వారా ఇటు భూమికి, అటు రైతులకు లాభాలను తెలియజేయనున్నట్లు తెలిపారు.