భార్యాభర్తల మధ్య ఏర్పడిన కలహం విషాదంగా ముగిసింది. మద్యం మత్తులో భార్యతో గొడవపడిన భర్త దోసెల పెనంతో విచక్షణారహితంగా దాడి చేయడంతో తీవ్రంగా గాయపడిన మహిళ మృతి చెందింది.
వి.కోట ఆంధ్రజ్యోతి రిపోర్టర్ వారణాసి జగన్మోహన్‌రెడ్డి హత్య కేసు నిందితులు తమీమ్, సుభాన్‌పై పీడీ యాక్టు నమోదు చేశారు.
చిన్నప్పుడే తండ్రి చనిపోయాడు. కుటుంబ బాధ్యతలు భుజాన వేసుకున్నా యువకుడు. మినీ వ్యాను డ్రైవరుగా కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఈ క్రమంలో సోమవారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో అతడు మృతిచెందడంతో, ఆ కుటుంబం పరిస్థితి అగమ్యగోచరంగా మారింది.
పాము కాటు.. ఇప్పటికీ గ్రామీణ ప్రాంతాల్లోని అనేక కుటుంబాల్లో విషాదాన్ని నింపుతోంది. విషపూరిత పాము కాటుకు గురయ్యాక సకాలంలో వైద్యం అందక ఏటా ఎందరో ప్రాణాలు కోల్పోతున్నారు.
జిల్లాలో కుప్పం మినహా మిగిలిన అసెంబ్లీ నియోజక వర్గాల్లో మహిళా ఓటర్లదే ఆధిక్యం. జూలై 31న విడుదలైన ముసాయిదా ఓటర్ల జాబితా ప్రకారం ఈ విషయం స్పష్టమైంది. ‘సర్’ సర్వే తర్వాత కుప్పంలో 185 మంది పురుషులు అధికంగా ఉన్నారు.
మదనపల్లె కోటగడ్డ మున్సిపల్ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయుడు షేక్ అబ్దుల్‌బబ్బార్ సస్పెండ్ అయ్యారు. స్థానిక కోటగడ్డ పాఠశాలలో ఆరో తరగతి చదువుతున్న ఓ విద్యార్థిని పట్ల అక్కడ స్కూల్ అసిస్టెంట్(సోషల్) షేక్ అబ్దుల్‌జబ్బార్ అసభ్యంగా ప్రవర్తించినట్లు వచ్చిన ఫిర్యాదుపై ఈ మేరకు చర్యలు తీసుకున్నారు.
మదనపల్లె గ్రామీణ నీటి సరఫరా విభాగం(ఆర్‌డబ్ల్యూఎస్) ఎగ్జిక్యూటివ్ ఇంజనీరు పి.రషీద్‌ఖాన్(55) మృతిచెందారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధ పడుతున్న ఈయన చికిత్స పొందుతూ వేలూరు సీఎంసీ ఆసుపత్రిలో సోమవారం కన్నుమూశారు.
మదనపల్లె బైపా్‌స రోడ్డు పూర్తికావడంతో వాహనాలు రయ్..రయ్ అంటూ ముందుకు దూసుకెళ్తున్నాయి. ఇటు ములకలచెరువు-మదనపల్లె వరకు, మదనపల్లె-తిరుపతి రోడ్డులో భాకరాపేట వరకు జాతీయ రహదారి పూర్తయింది.
వర్షాభావ పరిస్థితుల్లో ఉద్యాన పంటలు రైతులకు భరోసా కల్పిస్తాయని ఆ శాఖ అధికారులు చెబుతున్నారు.
కాణిపాక వరసిద్ధి వినాయక స్వామికి 21 రోజుల పాటు నిర్వహించే బ్రహ్మోత్సవాలను గతేడాది కంటే వైభవంగా నిర్వహిస్తామని ఆలయానికి చెందిన 14 గ్రామాల ఉభయదారులు చెప్పారు.