ఆరంభంలో ధాన్యం ధరలు అదుర్స్
ABN , Publish Date - Feb 05 , 2026 | 01:38 AM
ఈ ఏడాది ధాన్యం ధరలు ఆరంభంలోనే పరుగులు పెడుతున్నాయి.
ఈ ఏడాది ధాన్యం ధరలు ఆరంభంలోనే పరుగులు పెడుతున్నాయి. మూడేళ్లుగా ఎన్నడూలేని విధంగా మద్దతు ధరకంటే అధికంగా మిల్లర్లు, వ్యాపారులు పోటీపడి కొనుగోలు చేస్తుండడంతో అన్నదాతల్లో ఆనందం వ్యక్తమవుతోంది.
సూళ్లూరుపేట, ఫిబ్రవరి 4 (ఆంధ్రజ్యోతి) : సూళ్లూరుపేట, నాయుడుపేట వ్యవసాయ సబ్ డివిజన్ పరిఽఽధిలో ఈ ఏడాది దాదాపు 29 వేల హెక్టార్లో వరి పంటసాగు చేశారు. సెప్టెంబరు, అక్టోబరు మాసాల్లో ఎల్ది పైర్లు వేశారు. కేఎన్‌ఎం 1,638, బీపీటీ 2,781, బీపీటీ 5,204, షుగర్‌లెస్ 2781 రకాల ఽపంటలను సాగుచేశారు.ఎల్ది పైర్లు, ముందుగా వరినాట్లు వేసిన పంటలంతా సంకాంత్రి ముగియగానే కోత దశకు చేరుకోవడంతో పలు గ్రామాల్లో జోరుగా వరికోతలు కోస్తున్నారు. రబీ సీజన్‌లో పండిన ఽపంటకు ధర పెరిగింది. పుట్టి ఏకంగా రూ.21 వేలకు పైగా పలకడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మూడేళ్లుగా లేని ధరలు ఒక్కసారిగా పెరగడంతో రైతులు ఉపశమనం పొందుతున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా కేఎన్‌ఎం 1,638 రకం 77 కిలోల బస్తా ఏకంగా రూ.1,850 వరకు పలుకుతోంది. మిగిలిన రకాలు బస్తా రూ.1,700 నుంచి రూ.1,750 వరకు ధర పలుకుతోంది. గత ఏడాది ఇదే సీజన్‌లో బస్తా రూ.1,350 నుంచి రూ.1,500 వరకు మాత్రమే కొన్నారు. దీంతో రైతులు పెట్టుబడి కూడా చేతికి రాకుండా అల్లాడిపోయారు. ఈ ఏడాది ఆరంభంలోనే ధాన్యం ధరలు పైపైకి పరుగులు పెట్టడంతో వ్యాపారులు, మిల్లర్లు రైతులు చుట్టూ తిరిగి ధాన్యం కొనుగోలు చేస్తున్నారు. ఽధాన్యం ధరలు అశాజనకంగా ఉండడంతో రైతులు పండిన పంటను పొలాల్లోనే వ్యాపారులు, మిల్లర్లకు అమ్మేస్తున్నారు. రెండు వారాల నుంచి ఽధరలు నిలకడగా ఉండడంతో సూళ్లూరుపేట, తడ, దొరవారిసత్రం, పెళ్లకూరు, నాయుడుపేట ప్రాంతాల్లో వరి వంగడాలు కొంత పచ్చి ఉన్న యంత్రాలతో వరికోతలు కోసి వ్యాపారులకు అమ్మేస్తు న్నారు. కొందరు రైతులు తమిళనాడుకు ధాన్యం లోడ్లు తరలిస్తున్నారు. దిగుబడులు కూడా బాగా వచ్చినట్లు రైతులు చెబుతున్నారు.