Share News

క్యాన్సర్లకు స్విమ్స్‌లో అత్యాధునిక వైద్యసేవలు

ABN , Publish Date - Feb 05 , 2026 | 01:52 AM

అడ్వాన్స్‌ క్యాన్సర్‌ కేర్‌ ద్వారా క్యాన్సర్‌ విభాగం పూర్తిగా అభివృద్ధి , స్విమ్స్‌ సంచాలకులు, ఉపకులపతి డాక్టర్‌ ఆర్‌వీ కుమార్‌ స్విమ్స్‌లో ఘనంగా ప్రపంచ క్యాన్సర్‌ దినోత్సవం, అవగాహన ర్యాలీ, పోస్టర్లు, కరపత్రాల ఆవిష్కరణ

క్యాన్సర్లకు స్విమ్స్‌లో అత్యాధునిక వైద్యసేవలు
క్యాన్సర్‌ అవగాహన శిబిరాన్ని ప్రారంభిస్తున్న టీటీడీ ఇన్‌చార్జి ఈవో వెంకయ్య చౌదరి

తిరుపతి సిటీ, ఫిబ్రవరి 4(ఆంధ్రజ్యోతి): స్విమ్స్‌లో క్యాన్సర్‌ విభాగాన్ని పూర్తిస్థాయిలో అభివృద్ధి చేసి వ్యాధి ఏ దశలో ఉన్నా అత్యాధునిక వైద్యసేవలందిస్తున్నారని టీటీడీ ఇన్‌ఛార్జి ఈవో వెంకయ్య చౌదరి తెలిపారు. స్విమ్స్‌లో బుధవారం క్యాన్సర్‌పై అవగాహన ర్యాలీ నిర్వహించి పోస్టర్లను, కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నిర్వహించిన ర్యాలీలో వెంకయ్య చౌదరి మాట్లాడుతూ స్విమ్స్‌లో రూ.120కోట్ల వ్యయంతో 300 పడకలు, ఐసీయూలు, ఇతర అఽత్యాఽధునిక వైద్య పరికరాలతో ఏర్పాటు చేసిన అడ్వాన్స్‌డ్‌ క్యాన్సర్‌ కేర్‌ భవనాన్ని త్వరలోనే ప్రారంభిస్తామని వెల్లడించారు. స్విమ్స్‌ సంచాలకులు, ఉపకులపతి డాక్టర్‌ ఆర్వీ కుమార్‌ మాట్లాడుతూ క్యాన్సర్‌ వ్యాధి చికిత్స దశ దాటిపోయిన వారికి ఉపశమన సేవలందించేందుకు పాలియేటివ్‌ కేర్‌ విభాగాన్ని అభివృద్ధి చేస్తున్నామని వెల్లడించారు. క్యాన్సర్‌ వ్యాధి గ్రస్తులకు ఎన్టీఆర్‌ వైద్యసేవ ద్వారా పూర్తి ఉచితంగా చికిత్స అందిస్తున్నామని అదనంగా అయ్యే వైద్యఖర్చులను ప్రాణదాన పథకం కింద అందజేస్తున్నామని తెలిపారు.రేడియేషన్‌ అంకాలజీ విభాగాధిపతి డాక్టర్‌ సుబ్రహ్మణియన్‌, మెడికల్‌ అంకాలజీ విభాగాధిపతి డాక్టర్‌ భార్గవి, పాలియేటివ్‌కేర్‌ వింగ్‌ ప్రొఫెసర్‌ డాక్టర్‌ ప్రాణబంధుదాస్‌ తదితరులు పలు రకాల క్యాన్సర్‌ వ్యాధులపై అవగాహన కల్పించారు. భయం కాదు బాద్యత ముఖ్యం అనే అంశంతో క్యాన్సర్‌వ్యాధిపై అవగాహన కల్పించేలా స్విమ్స్‌ కళాశాలల విద్యార్థులు ప్రదర్శించిన స్కిట్‌ ఆకట్టుకుంది. అనంతరం క్యాన్సర్‌ వ్యాధిపై విజయం సాధించిన పలువురు టీటీడీ, స్విమ్స్‌ అందించిన సేవలను కొనియాడారు. అదే విధంగా తమ అనుభవాలను ఇతన పేషంట్లతో పంచుకున్నారు. ఇందులో భాగంగా మెడికల్‌ అంకాలజీ విబాగం ద్వారా వైద్యసవేలు అందుకుంటున్న నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం బండ్లపాలెం గ్రామానికిచెందిన అరుదైన క్యాన్సర్‌తోబాధపడుతున్న తుమ్మల సంధ్య(11) అనే చిన్నారికి మందుల కోసం నెలకు రూ.2లక్షలు అవుతోందని రెండు నెలలకయ్యే ఖర్చును మెడికల్‌ అంకాలజీ విభాగాధిపిత డాక్టర్‌ భార్గవి వ్యక్తిగతంగా సాయం అందించారని చిన్నారి తల్లి టీటీడీఇన్‌ఛార్జి వెంకయ్య చౌదరికి వివరించారు. స్విమ్స్‌కు ఎంతో రుణపడి ఉంటామని చెప్పారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన క్యాన్సర్‌ అవగాహన పోస్టర్ల ప్రదర్శనను సాయంత్రం వరకు విశేష సంఖ్యలో ప్రజలు సందర్శించారు. ఈ కార్యక్రమంలో మెడికల్‌ సూపరింటెండెంట్‌ సర్జికల్‌ ఆంకాలజీ విభాగాధిపతి డాక్టర్‌ నరేంద్ర, కమ్యూనిటీ మెడిసిన్‌ విభాగాధిపతి డాక్టర్‌ కె.నాగరాజ్‌, ఫిజియోథెరపీ కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ కె.మాధవి, త్రివేండ్రంకు చెందిన ఇంటర్నేషనల్‌ పెయిన్‌ ండ్‌ పాలియేటివ్‌కేర్‌ వింగ్‌ అడ్వైజర్‌ డాక్టర్‌ రాధ, ఆర్‌ఎంవో డాక్టర్‌ కోటిరెడ్డి, డిప్యూటీ డైరెక్టర్‌(ఎస్టాబ్లి్‌సమెంట్‌) డాక్టర్‌ ఆదికృష్ణయ్య, ఏడీ రాజశేఖర్‌, ఎంఎ్‌సడబ్ల్యూ ప్రసాద్‌, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

సిద్ధ క్లినికల్‌ రీసెర్చ్‌ యూనిట్‌ ఆధ్వర్యంలో...

ప్రపంచ క్యాన్సర్‌ దినోత్సవం సందర్భంగా స్విమ్స్‌ నిర్వహించిన ర్యాలీలో సిద్ధ క్లినికల్‌ రీసెర్చ్‌ యూనిట్‌ డాక్టర్లు పాల్గొన్నారు. అనంతరం క్యాన్సర్‌ పాలియేటివ్‌కేర్‌కు సంబంధించిన సమాచారాన్ని తెలియజేసే కరపత్రాలు,ముడి ఔషధాలు, మిల్లెట్లు, యోగాసనాల స్టాల్స్‌ను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో రీసెర్చ్‌ ఆఫీసర్‌ డాక్టర్‌ కె.సామ్రాజ్‌, మెడికల్‌ కన్సల్టెంట్‌ డాక్టర్‌ ఆర్‌ తమిళసెల్వన్‌, సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - Feb 05 , 2026 | 01:52 AM