వైభవంగా సీటీఎం గంగమ్మ పగలు తిరునాళ్ల
ABN , Publish Date - Feb 05 , 2026 | 01:47 AM
సీటీఎం నలవీర గంగాభవానీ జాతరలో భాగంగా పగలు తిరునాళ్ల బుధవారం అత్యంత వైభవంగా నిర్వహించారు
మదనపల్లె అర్బన్, ఫిబ్రవరి 4(ఆంధ్రజ్యోతి): సీటీఎం నలవీర గంగాభవానీ జాతరలో భాగంగా పగలు తిరునాళ్ల బుధవారం అత్యంత వైభవంగా నిర్వహించారు. ఉదయం అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి, భక్తులకు దర్శనం కల్పించారు. ప్రత్యేక వాహనంలో సీటీఎం పురవీధుల్లో ఊరేగించారు. ప్రతి ఇంటి ముంగిటా అమ్మవారికి టెంకాయకులు కొట్టి కర్పూర హారతులు సమర్పించారు. మహిళలు చీర, జాకెట్టు, పసుపు, కుంకుమ, గాజులు సమర్పించి హారతులు తీసుకున్నారు. రాత్రి తిరునాళ్లకు భక్తులు 60కి పైగా చాందినీ బండ్లు, టెంకాయపట్ల బండ్లు వందకుపైగా కట్టి మొక్కులు తీర్చుకున్నారు. ఆలయంలో క్యూలు నిండిపోయి గంటల తరబడి భక్తులు క్యూలైన్‌లో వేచి ఉండాల్సి వచ్చింది. పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. సీటీఎం సర్పంచ్, ఆలయ కమిటీ సభ్యులు సగినాల ఆనంద పార్థసారథి, వెలుగు చంద్ర, పారపట్ల సురేంద్రరెడ్డి, పోగాకు వీరప్రతాప్, శివారెడ్డి కార్యక్రమాలను పర్యవేక్షించారు. ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు వైఎ్‌స.షర్మిల, కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు గాజులు భాస్కర్, మదనపల్లె నియోజకవర్గ ఇన్‌చార్జి మల్లెల పవన్‌కుమార్‌రెడ్డి పాల్గొన్నారు. మల్లెల పవన్‌కుమార్‌రెడ్డి ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాన్ని షర్మిల ప్రారంభించారు.