Share News

సుపరిపాలనే ప్రభుత్వ లక్ష్యం

ABN , Publish Date - Feb 05 , 2026 | 01:49 AM

ప్రజా సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలన లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తున్నట్లు మంత్రి రాంప్రసాద్‌రెడ్డి తెలిపారు

సుపరిపాలనే ప్రభుత్వ లక్ష్యం
తిరుమలరాయగుట్ట వద్ద సీసీ రోడ్ల నిర్మాణానికి పూజలు చేస్తున్న మంత్రి రాంప్రసాద్‌రెడ్డి దంపతులు

రాయచోటి, ఫిబ్రవరి4(ఆంధ్రజ్యోతి): ప్రజా సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలన లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తున్నట్లు మంత్రి రాంప్రసాద్‌రెడ్డి తెలిపారు. బుధవారం సంబేపల్లి మండలంలో రూ2.10 కోట్లతో సీసీ రోడ్లు, పంచాయతీ భవనాలకు ఆయన శంకుస్థాపన చేశారు. సంబేపల్లి మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టామన్నారు. తిరుమలరాయుడిగుట్ట కలియుగ వేంకటేశ్వర స్వామి ఆలయానికి వచ్చే భక్తుల సౌకర్యార్థం పార్కింగ్‌, కాంపౌండ్‌ నిర్మాణానికి కృషి చేస్తామన్నారు. ప్రకాష్‌ నగర్‌కాలనీలో పొడి, తడి చెత్తను సేకరించేందుకు క్లీన్‌ అండ్‌ గ్రీన్‌ కార్యక్రమంలో భాగంగా వాహనాన్ని ప్రారంభించారు. మాజీ జడ్పీటీసీ మల్లు నరసారెడ్డి, టీడీపీ మండలాధ్యక్షుడు శివప్రసాద్‌రెడ్డి, సర్పంచ్‌లు రఘునాథరెడ్డి, మోహన్‌, మాజీ సర్పంచ్‌ సిద్దారెడ్డి, ఏఐసీసీ డైరెక్టర్‌ కొండా భాస్కర్‌రెడ్డి, మడితాటి రవీంద్రారెడ్డి, మల్లు విష్ణువర్ధన్‌రెడ్డి, సంబేపల్లి క్లస్టర్‌ ఇన్‌చార్జ్‌ విష్ణువర్ధన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

జల్‌జీవన్‌ మిషన్‌తో ఇంటింటికీ తాగునీరు

నియోజకవర్గంలోని నాలుగు మండలాల్లో జల్‌జీవన్‌ మిషన్‌ కింద ప్రతి ఇంటికీ తాగనీరు అందిస్తామని మంత్రి రాంప్రసాద్‌రెడ్డి తెలిపారు. ఏప్రిల్‌, మేలో గ్రామాల్లో తాగునీటి ఎద్దడి రాకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. తాగునీటి సమస్య శాశ్వత పరిష్కారం కోసం వెలిగల్లు ప్రాజెక్టు ద్వారా రూ.370కోట్లతో తాగునీరు కల్పిస్తామన్నారు. రైతులకు రాయితీ విత్తనాలు, డ్రిప్‌ పరికరాలు, అన్నదాత సుఖీభవ అందిస్తున్నామన్నారు.

Updated Date - Feb 05 , 2026 | 01:49 AM