వీఆర్‌ఏపై పాశవిక దాడి
ABN , Publish Date - Feb 05 , 2026 | 01:40 AM
ఇంటికి వెళ్తున్న సమయంలో చిట్వేలి రూట్‌లోని బ్రిడ్జి వద్ద వెనుక నుంచి మోటార్ బైకుతో ఢీకొట్టి కిందపడేశారు
రైల్వేకోడూరు రూరల్, ఫిబ్రవరి4(ఆంధ్రజ్యోతి): రైల్వేకోడూరు మండలంలోని ఓబనపల్లి వీఆర్‌ఏ కనుపర్తి మణిపై కత్తులతో దాడి జరిగింది. బుధవారం సాయంత్రం విధులు ముగించుకుని ఇంటికి వెళ్తున్న సమయంలో చిట్వేలి రూట్‌లోని బ్రిడ్జి వద్ద వెనుక నుంచి మోటార్ బైకుతో ఢీకొట్టి కిందపడేశారు. అనంతరం ముగ్గురు వ్యక్తులు ముందుగా రాడ్లతో, తరువాత కత్తులతో దాడి చేయడమే కాకుండా కళ్లలో కారం చల్లి తీవ్రంగా గాయపరిచారు. రక్తస్రావంతో అక్కడికక్కడే కుప్పకూలిన వీఆర్‌ఏని గమనించిన స్ధానికులు కోడూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రాథమిక చికిత్స అనంతరం పరిస్ధితి విషమంగా ఉండటంతో 108 వాహనంలో తిరుపతికి తరలించారు.సీఐ చంద్రశేఖర్ ఆస్పత్రికి చేరుకుని బాధితుడిని విచారించారు. ఘటనపై కేసు నమోదు చేసి దుండగుల కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు తెలిపారు.