ఏనుగు దంతాల కేసులో తమిళనాడు అధికారుల విచారణ
ABN , Publish Date - Feb 05 , 2026 | 01:32 AM
ఓ వ్యక్తిని ఆ రాష్ట్ర అటవీశాఖాధికారులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
పలమనేరు, ఫిబ్రవరి4 (ఆంధ్రజ్యోతి): తమిళనాడులో ఏనుగు దంతాల చోరీకి సంబంధించి పలమనేరు మండలానికి చెందిన ఓ వ్యక్తిని ఆ రాష్ట్ర అటవీశాఖాధికారులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.. తమిళనాడు- పలమనేరు నియోజకవర్గ సరిహద్దులోని పేర్ణాంబట్టు అటవీ ప్రాంతంలో ఆరునెలల క్రితం మూడు ఏనుగులు మృతి చెందాయి. సంఘటనా ప్రాంతానికి అటవీ అధికారులు వెళ్లి పరిశీలించగా మగ ఏనుగు దంతాలు చోరీ అయినట్లు చోరీ గుర్తించారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈనేపథ్యంలో గుడియాత్తంలో ఏనుగు దంతాన్ని విక్రయించేందుకు ప్రయత్నిస్తున్న ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. విచారణలో నిందితులకు సన్నిహితుడైన ఓ వ్యక్తి పలమనేరు మండలం చెత్తపెంటలో ఉన్నట్లు గుర్తించారు. ఈక్రమంలో బుధవారం సదరు వ్యక్తి అటవీశాఖ అధికారులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. తమిళనాడు అటవీ అధికారులు విచారణకు వచ్చిన విషయాన్ని రేంజర్ నారాయణ ధ్రువీకరించారు. ఆరాష్ట్ర కేసు అయినందున తమకు సంబంధంలేదన్నారు.