బిహార్ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి భారీ విజయం సాధించడంతో చిత్తూరులో బీజేపీ శ్రేణులు సంబరాలు చేసుకున్నాయి.
చిత్తూరు జిల్లా కమిటీలో ఎవరెవరికి చోటు దక్కుతుందా అని తెలుగుదేశం వర్గాలు ఆత్రుతగా ఎదురుచూస్తున్నాయి. తమకు ఫలానా పదవి కావాలని ఆ మధ్య త్రిసభ్య కమిటీని కోరిన నాయకులు కూడా తీవ్రంగా ప్రయత్నాలు చేసుకుంటూనేవున్నారు.
వైసీపీ ప్రభుత్వ హయాంలో రెండేళ్ళ క్రితం కుప్పం నియోజకవర్గ టీడీపీ నేతలపై నమోదు చేసిన రెండు హత్యాయత్నం కేసులను చిత్తూరు జిల్లా కోర్టు శుక్రవారం కొట్టివేసింది.
తిరుపతిలోని టీటీడీ పరిపాలనా భవనం మైదానంలో శుక్రవారం రాత్రి కార్తీక మహాదీపోత్సవం నిర్వహించారు. భారీ సంఖ్యలో భక్తులు హాజరై సామూహిక దీపారాధన చేశారు.
రేణిగుంట ఇన్‌చార్జి సబ్‌రిజిస్ట్రార్‌గా పనిచేస్తున్న ఆనందరెడ్డి మళ్లీ సస్పెండయ్యారు. ఈయనపై అవినీతి ఆరోపణలు రావడంతో స్టాంపుల, రిజిస్ట్రేషన్ శాఖ విచారణకు ఆదేశించింది.
శ్రీవారి దర్శనార్థం మహిళా క్రికెటర్ శ్రీచరణి శుక్రవారం రాత్రి కాలినడకన తిరుమల చేరుకున్నారు. వరాహస్వామిని దర్శించుకున్నారు. అనంతరం అన్నప్రసాదాలను స్వీకరించారు.
విజిలెన్స్ అధికారిగా చురుగ్గా సుదీర్ఘకాలం సేవలందించిన సతీ్‌షకుమార్ మృతి టీటీడీ ఉద్యోగులను తీవ్ర దిగ్ర్భాంతికి గురిచేసింది.
పరకామణిలో చోరీని పసిగట్టి ఫిర్యాదు చేసిన పోలీసు అధికారి సతీ్‌షకుమార్ అనుమానాస్పద మృతి తీవ్ర సంచలనంగా మారింది. తిరుపతిలో సీఐడీ విచారణకు వచ్చే క్రమంలో తాడిపత్రి సమీపంలో రైలుపట్టాల పక్కన ఆయన మృతదేహం పడుంది.
టీటీడీ పరకామణి కేసులో కీలక వ్యక్తి అయిన మాజీ టీటీడీ ఏవీఎ్‌సఓ సతీ్‌షకుమార్ మరణాన్ని రాష్ట్ర ప్రభుత్వం హత్య కోణంలో దర్యాప్తు చేయాలని టీటీడీ ట్రస్ట్ బోర్డు సభ్యుడు భానుప్రకా్‌షరెడ్డి కోరారు.
ఏనుగులు మరో రైతును పొట్టనబెట్టుకున్నాయి. జిల్లాలో రోజూ ఎక్కడో ఒకచోట పంటలపై దాడి చేసి తొక్కి నాశనం చేస్తున్న ఏనుగులు అటవీ సమీప ప్రాంతాల రైతుల కంటికి కునుకు లేకుండా చేస్తున్నాయి. అప్పుడప్పుడూ రైతులనూ తొక్కి చంపేస్తున్నాయి.ఈసారి కుప్పం మండలం ఉర్లఓబనపల్లె పంచాయతీ కూర్మానపల్లెకు చెందిన రైతు కిట్టప్ప(64) ఒంటరి ఏనుగు దాడితో ప్రాణాలు కోల్పోయాడు.