పీసీసీ చీఫ్ షర్మిల రేపు రాక
ABN , Publish Date - Feb 06 , 2026 | 01:53 AM
ఉపాధి హామీ పథకం పరిరక్షణ యాత్రలో భాగంగా పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల శనివారం జిల్లాలో పర్యటించనున్నారు. సూళ్లూరుపేట మండలం కోట పోలూరు గ్రామంలో ఉదయం 10గంటల నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు రచ్చబండ కార్యక్రమంలో పాల్గొంటారు.
సూళ్లూరుపేటలో రచ్చబండ
సూళ్లూరుపేట, ఫిబ్రవరి 5(ఆంధ్రజ్యోతి): ఉపాధి హామీ పథకం పరిరక్షణ యాత్రలో భాగంగా పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల శనివారం జిల్లాలో పర్యటించనున్నారు. సూళ్లూరుపేట మండలం కోట పోలూరు గ్రామంలో ఉదయం 10గంటల నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు రచ్చబండ కార్యక్రమంలో పాల్గొంటారు. ఉపాధి హామీ పథకం కూలీలతో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకుంటారు. కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ పథకం పేరు నుంచి మహాత్మగాంధీ పేరు తొలగించి, పథకం పేరు మార్చిన వైనాన్ని ఆమె ప్రజల్లోకి తీసుకెళ్లమన్నారు.అనంతరం కాంగ్రెస్ నాయకులతో సమావేశమై పార్టీని బలోపేతం చేయడంపై చర్చించనున్నారు.పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మస్తాన్‌వలి తదిరులు పాల్గొంటారు.