వైభవంగా సంకటహర గణపతి వ్రతం
ABN , Publish Date - Feb 06 , 2026 | 01:35 AM
కాణిపాకంలో గురువారం సంకటహర గణపతి వ్రతాన్ని ఆలయ అధికారులు భక్తుల చేత వైభవంగా నిర్వహింపజేశారు. ఉదయం మూల విరాట్‌కు అభిషేకం చేశాక ఆస్థాన మండపంలోని వేదికపై సిద్ధి, బుద్ది సమేత వరసిద్ధుడి ఉత్సవ విగ్రహాలను కొలువుదీర్చి విశేషపూజలు నిర్వహించారు.
స్వర్ణరథంపై మాడవీధుల్లో ఊరేగిన వరసిద్ధుడు
ఐరాల(కాణిపాకం), ఫిబ్రవరి 5(ఆంధ్రజ్యోతి): కాణిపాకంలో గురువారం సంకటహర గణపతి వ్రతాన్ని ఆలయ అధికారులు భక్తుల చేత వైభవంగా నిర్వహింపజేశారు. ఉదయం మూల విరాట్‌కు అభిషేకం చేశాక ఆస్థాన మండపంలోని వేదికపై సిద్ధి, బుద్ది సమేత వరసిద్ధుడి ఉత్సవ విగ్రహాలను కొలువుదీర్చి విశేషపూజలు నిర్వహించారు. ఉత్సవమూర్తుల ఎదుట భక్తుల ఆధ్వర్యంలో సంకటహర గణపతి వ్రతాన్ని నిర్వహించారు. రాత్రి సిద్ధి, బుద్ధి సమేత వరసిద్ధి వినాయకస్వామి ఉత్సవర్లను స్వర్ణరథంపై ఉంచి ఆలయ మాడవీధులలో ఊరేగించారు. ఆయా కార్యక్రమాల్లో పూతలపట్టు ఎమ్మెల్యే మురళీమోహన్, ఈవో పెంచలకిషోర్, ఏఈవో రవీంద్రబాబు, సూపరింటెండెంట్లు కోదండపాణి, వాసు, ఆలయ ఇన్‌స్పెక్టర్లు బాలాజీనాయుడు, రవి, చిత్తూరు ఏఎస్సీ రాజశేఖర్‌రాజు తదితరులు పాల్గొన్నారు.