Share News

ఆన్‌లైన్‌లో పెళ్లి సంబంధం

ABN , Publish Date - Feb 06 , 2026 | 01:43 AM

ఆన్‌లైన్‌లో పెళ్లి సంబంధం వెతుకుతున్న యువకుడికి ఓ యువతి పరిచయమైంది. ట్రాప్‌ చేసి తన ఖాతాకు డబ్బు జమ చేయించుకుని మోసం చేసింది.

ఆన్‌లైన్‌లో పెళ్లి సంబంధం

ఫేక్‌ ఐడీతో పరిచయమైన యువతి

రూ.3.7 లక్షలు తీసుకుని మోసం

చిత్తూరు అర్బన్‌, ఫిబ్రవరి 5 (ఆంధ్రజ్యోతి): ఆన్‌లైన్‌లో పెళ్లి సంబంధం వెతుకుతున్న యువకుడికి ఓ యువతి పరిచయమైంది. ట్రాప్‌ చేసి తన ఖాతాకు డబ్బు జమ చేయించుకుని మోసం చేసింది. బాధితుడి ఫిర్యాదుపై చిత్తూరు తాలూకా పోలీసులు కేసు నమోదు చేశారు. వివరాలిలా ఉన్నాయి. వచిత్తూరు రూరల్‌ మండలం పెద్దిశెట్టిపల్లెకు చెందిన ఓ యువకుడు మ్యాట్రీమోనీ, ఆన్‌లైన్‌లో వధువుల వివరాలను వెదకుతున్నాడు. ఈ క్రమంలో ఫేక్‌ ఐడీతో ఓ యువతితో పరిచయం ఏర్పడింది. కొన్ని నెలలపాటు మాటలు సాగాయి. తాను ఆన్‌లైన్‌ ట్రేడింగ్‌లో డబ్బులను ఇన్వెస్ట్‌ చేస్తున్నానని ఆమె చెప్పింది. ఆ యువకుడి వద్ద విడతల వారీగా రూ. 3.7 లక్షలను ఓ బ్యాంకు అకౌంట్‌లో వేసుకుంది. ఆ తర్వాత ఆమె వ్యవహారం ఫేక్‌ అని తెలియడంతో గురువారం ఆయన తాలూకా పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - Feb 06 , 2026 | 01:44 AM