Share News

అదృష్ట చేప అరోవణ !

ABN , Publish Date - Feb 06 , 2026 | 01:45 AM

ఇదో అరుదైన చేప..తైవాన్‌ దేశంలో దీనిని అదృష్ట చేపగా భావించి ఇండ్లలో పెంచుకుంటుంటారు.పేరు అరోవణ.. ఫసిఫిక్‌ మహాసముద్రంలో దొరికే ఈ చేప కేజీ నుంచి 1.5 కేజీల వరకు పెరుగుతుంది.

  అదృష్ట చేప అరోవణ !

తడ, ఫిబ్రవరి 5 (ఆంధ్రజ్యోతి) : ఇదో అరుదైన చేప..తైవాన్‌ దేశంలో దీనిని అదృష్ట చేపగా భావించి ఇండ్లలో పెంచుకుంటుంటారు.పేరు అరోవణ.. ఫసిఫిక్‌ మహాసముద్రంలో దొరికే ఈ చేప కేజీ నుంచి 1.5 కేజీల వరకు పెరుగుతుంది. రూ.1.50 లక్షల నుంచి 2 లక్షల దాకా ధర పలుకుతుంది.ఒంటరిగానే వుండే ఈ చేప ఇంచుమించు పదేళ్లపాటు జీవిస్తుంది.పొరబాటున మరో చేప దీని దరికివస్తే చంపేస్తుంది...లేదా తరిమేస్తుంది.ఇటువంటి చేపలను మాంబట్టు సెజ్‌లోని అపాచీ పరిశ్రమలో ప్రత్యేకంగా తయారుచేసిన ఆక్వేరియంలో సంరక్షిస్తున్నారు.నాలుగు చేపలను పెంచుతున్నామని అందులో ఒకచేప ఈ మధ్య కాలంలో చనిపోతే తైవాన్‌ నుంచి మరో చేపను తీసుకువచ్చామని అపాచీ పరిశ్రమ పీఆర్వో మోహన్‌ తెలిపారు. తమ పరిశ్రమ తైవాన్‌ దేశానికి చెందిన పరిశ్రమ కావడంతో వారి నమ్మకాల ప్రకారమే వీటిని ఏర్పాటు చేస్తున్నామన్నారు.

Updated Date - Feb 06 , 2026 | 01:46 AM