• Home » Andhra Pradesh » Chittoor

చిత్తూరు

భక్త జనసంద్రం ముక్కంటి ఆలయం

భక్త జనసంద్రం ముక్కంటి ఆలయం

శ్రీకాళహస్తీశ్వరాలయం ఆదివారం భక్తజన సంద్రంగా మారింది. వరుస సెలవులు కావడంతో రెండు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా దేశ నలుమూలల నుంచి అధిక సంఖ్యలో స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు.

ఇక డబుల్‌ ఎంట్రీల వంతు

ఇక డబుల్‌ ఎంట్రీల వంతు

ఓ వ్యక్తికి తాను పుట్టిన ఊరితోపాటు పనిచేస్తున్న పక్క రాష్ట్రంలోనూ ఓటు హక్కు ఉన్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం గుర్తించింది. ఇలా రెండు చోట్లా ఉన్న ఓట్లను పరిశీలించి.. ఒక ఓటును తొలగించడానికి అవసరమైన కసరత్తు మొదలుకానుంది.

బొప్పాయి ధరలను ఇష్టానుసారం తగ్గించేస్తారా?

బొప్పాయి ధరలను ఇష్టానుసారం తగ్గించేస్తారా?

బొప్పాయి ధరలను ఇష్టానుసారం తగ్గించేస్తారా? అంటూ దళారులతో రైతులు వాగ్వాదానికి దిగారు. ఈ ఘటన ఆదివారం రైల్వేకోడూరులో జరిగింది. లారీలు తోటల్లోకి వెళ్లకుండా అడ్డుకోవడంతో స్వల్ప ఉద్రిక్తత నెలకొంది.

‘అమరావతి చాంపియన్‌షి్‌ప’ జిల్లాస్థాయి పోటీలు ప్రారంభం

‘అమరావతి చాంపియన్‌షి్‌ప’ జిల్లాస్థాయి పోటీలు ప్రారంభం

అమరావతి చాంపియన్‌షి్‌ప-2026 జిల్లాస్థాయి క్రీడా పోటీలు ఆదివారం తిరుపతిలో అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. ఎస్వీయూ, ఎస్వీయూ క్యాంపస్‌ మైదానాల్లో జరిగిన ఈ పోటీలను ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు, కలెక్టర్‌ వెంకటేశ్వర్‌, శాప్‌ చైర్మన్‌ రవినాయుడు ప్రారంభించారు. శాప్‌ బోర్డు డైరెక్టర్‌ రజని తదితరులు పాల్గొన్నారు. తొలిరోజున అథ్లెటిక్స్‌, వాలీబాల్‌ పోటీలు హోరాహోరీగా జరిగాయి. ప్రతిభ చూపిన వారిని రాష్ట్రస్థాయికి ఎంపిక చేశారు.

‘మంగాపురం’ ఘటనపై ప్రశ్నలెన్నో?

‘మంగాపురం’ ఘటనపై ప్రశ్నలెన్నో?

చిత్తూరు రూరల్‌ మండలం మంగాపురం గ్రామంలో శుక్రవారం అర్ధరాత్రి జరిగిన ఘటనపై ఎన్నో ప్రశ్నలు తలెత్తుతున్నాయి. దొంగతనానికి వస్తే కాపలాదారుడ్ని చంపాల్సిన అవసరం ఏమొచ్చింది? ఆనందరావుపై ఏదైనా కక్ష ఉందా? అతడిని చంపాక వెళ్లిపోకుండా, మళ్లీ ఇంట్లోకి వచ్చేందుకు ఎందుకు ప్రయత్నించారు?

హడలెత్తించిన ఏనుగుల మంద

హడలెత్తించిన ఏనుగుల మంద

రామకుప్పం మండలంలో 16ఏనుగుల మంద శనివారం రాత్రి నుంచి ఆదివారం తెల్లవారుజాము వరకు అటవీశాఖ అధికారులు, ననియా బేస్‌క్యాంపు సిబ్బందిని పరుగులు తీయించాయి. శనివారం రాత్రి 10.30 గంటల వరకు రామాపురంతండా సమీపంలోని కొల్లమడుగు ప్రాంతంలో ఏనుగుల మంద తిష్ట వేసినట్లు అధికారులు గుర్తించారు.

  నేటి నుంచి ఆరో విడత రీసర్వే ప్రారంభం

నేటి నుంచి ఆరో విడత రీసర్వే ప్రారంభం

చిత్తూరు జిల్లావ్యాప్తంగా 92 గ్రామాల్లో.. 1.6 లక్షల ఎకరాల్లో ఆరో విడత రీ సర్వే జరగనుంది. సోమవారం నుంచి ఈ భూముల రీసర్వే ప్రారంభించనున్నారు. దీనికోసం 3-4 రోజులుగా ఆయా గ్రామాల్లో రైతులకు అవగాహన సదస్సులు నిర్వహించారు.

  పల్లెల్లో పేలుతున్న నాటుతుపాకులు

పల్లెల్లో పేలుతున్న నాటుతుపాకులు

నాటు తుపాకుల ఉద్దేశం గతి తప్పింది. క్రమేణా పల్లెల్లో హింసాత్మక ఘటనలకు వాడుతున్నారు. దీనిపై పోలీసులకూ సమాచారం రావడంతో కొన్ని నాటు తుపాకులు స్వాధీనం చేసుకున్నారు. కొందరు షికారీల వద్ద ఉన్న తుపాకులనూ విడతల వారీగా సీజ్‌ చేశారు.

స్థానిక సమరానికి సన్నద్ధం

స్థానిక సమరానికి సన్నద్ధం

జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికలకు రంగం సిద్ధమవుతోంది.రెండు నెలల్లో ప్రక్రియ పూర్తి చేసేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం కసరత్తు చేస్తోంది. ప్రధాన రాజకీయ పార్టీల నాయకులు కూడా గ్రామస్థాయిల్లో సమావేశాలు నిర్వహించి క్యాడర్‌ను సిద్ధం చేస్తున్నారు. మరోవైపు జిల్లా నుంచి తెలంగాణ రాష్ట్రం మహబూబ్‌నగర్‌కు తీసుకెళ్లిన బ్యాలెట్‌ బాక్సులు 13వ తేదీన తిరుపతికి రానున్నాయి. వీటిని నగరంలోని ఎంపీడీవో కార్యాలయ సమీపంలో ఉన్న గోదాములో భద్రపరచనున్నారు.

కాణిపాకంలో భక్తుల రద్దీ

కాణిపాకంలో భక్తుల రద్దీ

స్వయంభు కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి ఆలయం శనివారం భక్తుల రద్దీతో కిటకిటలాడింది. ఉదయం నుంచి అధిక సంఖ్యలో భక్తులు స్వామి దర్శనానికి విచ్చేశారు. దీంతో ఆలయ క్యూలైన్లు పూర్తిగా నిండిపోయాయి. వెలుపల వరకు వ్యాపించాయి. ప్రతి భక్తుడికి స్వామివారి దర్శనం కల్పించడానికి చైర్మన్‌ మణినాయుడు,ఈవో పెంచలకిషోర్‌ క్యూల్లను క్రమబద్ధీకరించారు.



తాజా వార్తలు

మరిన్ని చదవండి