Share News

ఈ-సెకిళ్ల పంపిణీలో సమర్ధసేవలు

ABN , Publish Date - Feb 08 , 2026 | 01:02 AM

డీఆర్‌డీఏ సిబ్బందికి కలెక్టర్‌ ప్రశంస

ఈ-సెకిళ్ల పంపిణీలో సమర్ధసేవలు
డీఆర్‌డీఏ సిబ్బందికి ప్రశంసాపత్రాలు అందిస్తున్న కలెక్టర్‌ సుమిత్‌ కుమార్‌

చిత్తూరు సెంట్రల్‌, ఫిబ్రవరి 7(ఆంధ్రజ్యోతి): ఈ-సైకిళ్ల పంపిణీలో ప్రతిభ కనబరిచిన డీఆర్‌డీఏ సిబ్బందిని జిల్లా కలెక్టర్‌ సుమిత్‌ కుమార్‌ ప్రశంసించారు. శనివారం కలెక్టరేట్‌లోని డీఆర్‌డీఏ సమావేశ మందిరంలో పీడీ శ్రీదేవితో కలిసి ఆయన ప్రశంసాపత్రాలను అందజేశాశారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ కుప్పం పట్టణం గిన్నిస్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డుల్లోకి నమోదయ్యేలా 24 గంటల వ్యవధిలో 5555 ఈ-సైకిళ్లను పంపిణీ చేశామన్నారు. డీఆర్‌డీఏ అధికారులు, సిబ్బంది సమన్వయంతో పనిచేయడంతోనే ఇది సాధ్యమైందన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఈవిషయంలో సంతోషం వ్యక్తం చేశారన్నారు. స్వచ్ఛంద కార్యక్రమాలు, మహిళా సంఘాలను బలోపేతం లాంటి కార్యక్రమాల అమలుకు కలిసి కట్టుగా పనిచేయాలన్నారు. సమావేశంలో డీఆర్‌డీఏ డీపీఎంలు, ఏపీఎంలు, ఏపీఎంసీసీ, సభ్యులు పాల్గొన్నారు.

Updated Date - Feb 08 , 2026 | 01:02 AM