రేపట్నుంచి ఎస్వీయూలో న్యాయోత్సవ్
ABN , Publish Date - Feb 06 , 2026 | 01:57 AM
తిరుపతిలోని శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయంలో రేపట్నుంచి న్యాయోత్సవ్ కార్యక్రమం జరగనుంది.యూనివర్సిటీ న్యాయ విభాగం చేపట్టిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సుప్రీంకోర్టులోని అటార్నీ జనరల్ ఆర్. వెంకట్రామన్ హాజరు కానున్నారు.
- సుప్రీంకోర్టు అటార్నీ జనరల్ వెంకట్రామన్ రాక
- హాజరు కానున్న న్యాయ నిపుణులు, విద్యార్థులు
తిరుపతి (విశ్వవిద్యాలయాలు), ఫిబ్రవరి 5 (ఆంధ్రజ్యోతి): తిరుపతిలోని శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయంలో రేపట్నుంచి న్యాయోత్సవ్ కార్యక్రమం జరగనుంది.యూనివర్సిటీ న్యాయ విభాగం చేపట్టిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సుప్రీంకోర్టులోని అటార్నీ జనరల్ ఆర్. వెంకట్రామన్ హాజరు కానున్నారు.శనివారం ఉదయం 10 గంటలకు శ్రీనివాసా ఆడిటోరియంలో ఇందుకు సంబంధించిన ప్రారంభ సభ నిర్వహిస్తారు. ఇందులో ఆర్. వెంకట్రామన్‌తో పాటు హైకోర్టు అదనపు అడిషనల్ జడ్జి అవధానం హరిహరనాథ శర్మ, విశాఖపట్నంలోని దామోదరం సంజీవయ్య నేషనల్ లా యూనివర్సిటీ వీసీ ప్రొఫెసర్ డి. సూర్యప్రకాష్, ఎస్వీయూ వీసీ నరసింగరావు, రెక్టార్ అప్పారావు, రిజిస్ట్రార్ భూపతి నాయుడు, ప్రిన్సిపాల్ సుధారాణి పాల్గొంటారు. వైస్ ప్రిన్సిపాల్ భాస్కరరెడ్డి సభకు అధ్యక్షత వహిస్తారు. మూడు రోజుల పాటు నిర్వహించే న్యాయోత్సవ్‌లో భాగంగా న్యాయ సంబంధమైన పలు అంశాలపై చర్చాగోష్టులు, ముఖాముఖి, సదస్సులు, పోటీలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. పలువురు న్యాయ నిపుణులు, పూర్వ న్యాయ విభాగ విద్యార్థులు హాజరు కానున్నారు.