• Home » Andhra Pradesh » Chittoor

చిత్తూరు

హతమార్చింది సోదరుడే

హతమార్చింది సోదరుడే

పెద్దపంజాణి మండలం మారపల్లి వద్ద ఈనెల 6వ తేది జరిగిన శ్రీనివాసులు హత్యను ఛేదించినట్టు పలమనేరు డీఎస్పీ ప్రభాకర్‌ తెలిపారు. ఈ వివరాలను మంగళవారం ఆయన పలమనేరు పోలీసు స్టేషన్‌లో మీడియాకు వెల్లడించారు.

జిల్లా జువెనైల్‌ జస్టిస్‌ బోర్డు ఏర్పాటు

జిల్లా జువెనైల్‌ జస్టిస్‌ బోర్డు ఏర్పాటు

తిరుపతి కేంద్రంగా జిల్లా ఏర్పాటయ్యాక మొదటిసారిగా జిల్లా జువెనైల్‌ బోర్డు ఏర్పాటైంది. నేరాలకు పాల్పడిన బాలల సంక్షేమం, సంరక్షణ, పునరావాసం వంటి కార్యక్రమాలను ఈ బోర్డు పర్యవేక్షిస్తుంది. దీనికి హైకోర్టు నామినేట్‌ చేసే ప్రిన్సిపల్‌ మొజిస్ట్రేట్‌ అధ్యక్షత వహిస్తారు. సోషల్‌ వర్కర్‌ మెంబరుగా పాకాల మండలం నేలదానిపల్లెకు చెందిన గుంటూరి కేశవులు నాయుడు నియమితులయ్యారు.

తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్‌ వాహనాల ప్రారంభం

తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్‌ వాహనాల ప్రారంభం

తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్‌ సేవలను సద్వినియోగంచేసుకోవాలని కలెక్టర్‌ వెంకటేశ్వర్‌ పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా మంజూరుచేసిన 16 వాహనాలు మంగళవారం జిల్లా కేంద్రానికి చేరుకున్నాయి. వాటి ద్వారా గర్భిణులు,బాలింతలు, నవజాత శిశువులకు సురక్షిత రవాణాసేవలు అందించనున్నారు.

పలమనేరులో జీవిత ఖైదీ పరారీ

పలమనేరులో జీవిత ఖైదీ పరారీ

పలమనేరులో జైళ్లశాఖ నిర్వహిస్తున్న ఐవోసీఎల్‌ పెట్రోలు బంకులో పనిచేస్తున్న జీవిత ఖైదీ ఎన్‌.సూర్య అలియాస్‌ సూరి(34) పరారయ్యాడు. ఈ మేరకు జైలు సూపరింటెండెంట్‌ ఎ.యూనస్‌ ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు.

 ట్రావెల్స్‌ బస్సుల దూకుడు

ట్రావెల్స్‌ బస్సుల దూకుడు

ప్రైవేట్‌ బస్సుల వేగానికి హద్దూపద్దూ ఉండడంలేదు. నిత్యం ప్రమాదాలు జరుగుతున్నా డ్రైవర్ల దూకుడు తగ్గడంలేదు. తాజాగా రెండు బస్సుల అతివేగం ఓజిలి మండలం పెద్దపరియ క్రాస్‌ రోడ్డుకు సమీపాన అలజడి సృష్టించింది. అదృష్టవశాత్తూ ప్రాణాపాయం తప్పింది.పోలీసుల కథనం మేరకు.. మంగళవారం తెల్లవారుజామున బెంగళూరు నుంచి విజయవాడకు శ్యామోలి, ఇంటర్‌సిటీ స్మార్ట్‌ బస్‌ ట్రావెల్స్‌ సర్వీసులు ఒకదాని వెంట మరొకటి అత్యంత వేగంతో దూసుకుపోతూ పెద్దపరియ క్రాస్‌ రోడ్డు దాటాక ఓవర్‌టేక్‌ చేసే క్రమంలో అదుపు తప్పాయి.బస్సులు రెండూ ఒకదాన్నొకటి రాసుకుంటూ వెళ్లి రహదారి పక్కన సూచిక బోర్డు స్తంభాన్ని ఢీకొట్టి రోడ్డుకు అడ్డంగా తిరిగిపోయాయి. దీంతో ప్రయాణికులు హడలిపోయారు.

శ్రీకాళహస్తి హత్య కేసును ఛేదించిన పోలీసులు.. నలుగురి అరెస్ట్

శ్రీకాళహస్తి హత్య కేసును ఛేదించిన పోలీసులు.. నలుగురి అరెస్ట్

శ్రీకాళహస్తిలో సంచలనంగా మారిన హత్య కేసును తిరుపతి జిల్లా పోలీసులు ఛేదించారు. ఈ కేసుకు సంబంధించి అంతర్రాష్ట్ర నేరచరిత్ర కలిగిన నలుగురు నిందితులను అరెస్ట్ చేశారు.

తిరుమల కిటకిట!

తిరుమల కిటకిట!

వరుస సెలవుల నేపథ్యంలో తిరుమల శ్రీవారి ఆలయం భక్తులతో కిటకిటలాడింది. గత మూడు రోజుల్లో దాదాపు 33 వేల వాహనాలు తిరుమలకు వచ్చాయి.

TDP: కుప్పంలో టీడీపీ విజయోత్సవం

TDP: కుప్పంలో టీడీపీ విజయోత్సవం

రెండేళ్ల కూటమి ప్రభుత్వ పాలన విజయాలను స్మరించుకుంటూ కుప్పంలో సోమవారం టీడీపీ ఆఽధ్వర్యంలో సాగిన విజయోత్సవ ర్యాలీ సాగింది.

YCP: ర్యాలీలకు వైసీపీ శ్రేణుల సమాయత్తం

YCP: ర్యాలీలకు వైసీపీ శ్రేణుల సమాయత్తం

జిల్లాలో 30 యాక్టు అమల్లో ఉన్నందున బహిరంగ ర్యాలీలు, సభలు, సమావేశాలకు అనుమతి లేదని పోలీసులు చెప్పినా వైసీపీ శ్రేణులు వినిపించుకోలేదు.

YCP: అయ్యోపాపం వైసీపీ!

YCP: అయ్యోపాపం వైసీపీ!

డీఎస్సీ నిర్వహణలో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ సోమవారం చేపట్టిన ర్యాలీలకు వైసీపీ నేతలు పడరానిపాట్లు పడ్డారు.



తాజా వార్తలు

మరిన్ని చదవండి