Share News

నకిలీ రసీదులతో స్వాహాయణం

ABN , Publish Date - May 30 , 2026 | 01:04 AM

శ్రీవేంకటేశ్వర యూనివర్సిటీలో నకిలీ రసీదులు సృష్టించి రూ.65,686 స్వాహా చేశారని పోలీసులకు ఫిర్యాదు అందింది. దీనిపై కేసు నమోదు చేసినట్లు ఎస్వీయూ క్యాంపస్‌ పోలీ్‌సస్టేషన్‌ ఇన్‌చార్జి ఇన్‌స్పెక్టర్‌ పి.రామకృష్ణ తెలిపారు.

 నకిలీ రసీదులతో స్వాహాయణం

ఎస్వీయూలో ఇద్దరు ఉద్యోగుల ప్రమేయంపై రిజిస్ర్టార్‌ ఫిర్యాదు

కేసు నమోదు చేసిన పోలీసులు

తిరుపతి(నేరవిభాగం), మే 29 (ఆంధ్రజ్యోతి): శ్రీవేంకటేశ్వర యూనివర్సిటీలో నకిలీ రసీదులు సృష్టించి రూ.65,686 స్వాహా చేశారని పోలీసులకు ఫిర్యాదు అందింది. దీనిపై కేసు నమోదు చేసినట్లు ఎస్వీయూ క్యాంపస్‌ పోలీ్‌సస్టేషన్‌ ఇన్‌చార్జి ఇన్‌స్పెక్టర్‌ పి.రామకృష్ణ తెలిపారు. రిజిస్ట్రార్‌ ఎం.భూపతి నాయుడు ఇచ్చిన ఫిర్యాదుతో విచారణ ప్రారంభించారు. 2026 జనవరి నుంచి మే 27వ తేదీవరకు జరిగిన లావాదేవీలను పరిశీలించగా సర్టిఫికెట్ల జారీకి సంబంధించిన ఫీజుల విషయంలో మొత్తం 27 నకిలీ రసీదులు రిజిస్ర్టార్‌ గుర్తించారు. ఈ నకిలీ రసీదులతో రూ.65,686 మేర నష్టం జరిగినట్లు తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఎస్వీయూ ఎంక్వయిరీ కౌంటర్‌లో పనిచేస్తున్న చిరంజీవి నాయక్‌కు ప్రత్యక్ష ప్రమేయం ఉన్నట్లు, జియాలజీ విభాగంలో అకడమిక్‌ కన్సల్టెంట్‌గా పనిచేస్తున్న శంకర్‌కు పరోక్ష ప్రమేయం ఉన్నట్లు ఫిర్యాదులో తెలియజేశారు. కేసు నమోదు చేసి, విచారణ చేస్తున్నట్లు ఇన్‌స్పెక్టర్‌ రామకృష్ణ వెల్లడించారు.

Updated Date - May 30 , 2026 | 01:04 AM