‘ఎబోలా’ అలర్ట్
ABN , Publish Date - May 30 , 2026 | 01:06 AM
బెంగళూరులోని ఓ మహిళకు ఎబోలా లక్షణాలున్నట్లు అనుమానాలు వ్యక్తమవడంతో వైద్య ఆరోగ్య శాఖ మరింత అప్రమత్తమైంది.
తిరుపతి సెంట్రల్, మే 29 (ఆంధ్రజ్యోతి): బెంగళూరులోని ఓ మహిళకు ఎబోలా లక్షణాలున్నట్లు అనుమానాలు వ్యక్తమవడంతో వైద్య ఆరోగ్య శాఖ మరింత అప్రమత్తమైంది.ఇప్పటికే తిరుపతి రుయాస్పత్రిలో 15 బెడ్లతో ఐసోలేషన్ వార్డు ఏర్పాటు చేసిన అధికారులు ప్రత్యేక అంబులెన్సు అందుబాటులో ఉంచారు.ఎబోలా ప్రభావిత దేశాల నుంచి వచ్చే ప్రయాణికుల్లో అనుమానితులను గుర్తించడానికి విమానాశ్రయ అధికారుల సహకారం తీసుకుంటున్నారు.విమానాశ్రయ డైరెక్టర్ భూమినాధన్‌తో డీఎంహెచ్‌వో బాలకృష్ణ నాయక్, ఇతర శాఖల అధికారులు సమీక్షించారు. ఐసోలేషన్ వార్డుకు చెస్ట్ అండ్ అలర్జీ డాక్టర్ సుబ్బారావును ఇన్‌చార్జిగా నియమించడానికి చర్యలు తీసుకుంటున్నారు. అలాగే నోడల్ అధికారిగా డాక్టర్ సి.సురే్‌షకుమార్‌ను నియమించినట్లు రుయా సూపరింటెండెంట్ మనోహర్ తెలిపారు. ఎబోలా ఇన్‌ఫెక్షన్ నియంత్రణ, రోగికి అందించాల్సిన అత్యవసర చికిత్సపై వైద్యులు, నర్సులు, పారామెడికల్ సిబ్బందికి శిక్షణ ఇస్తున్నట్లు చెప్పారు. అలాగే ఒకట్రెండు రోజుల్లో రుయా ఆస్పత్రికి అత్యవసర మందులు, పీపీఈ కిట్లు వస్తాయని చెప్పారు.