Share News

Solar: సోలార్‌ హ్యాంగ్‌ ఫెన్సింగ్‌ ఏర్పాటుకు చర్యలు

ABN , Publish Date - May 31 , 2026 | 12:36 AM

మండల పరిధిలో ఏనుగుల దాడుల కట్డడికి అడవి మధ్యలోని గ్రామాల చుట్టూ త్వరలో సోలార్‌ హ్యాంగింగ్‌ ఫెన్సింగ్‌ ఏర్పాటు చేయనున్నట్టు కుప్పం అటవీ రేంజ్‌ అధికారి జయశంకర్‌, పీకేఎం ఉడా చైర్మన్‌ డా.సురే్‌షబాబులు తెలిపారు.

Solar: సోలార్‌ హ్యాంగ్‌ ఫెన్సింగ్‌ ఏర్పాటుకు చర్యలు
సోలార్‌ హ్యాంగింగ్‌ ఫెన్సింగ్‌ను పరిశీలిస్తున్న ఫారెస్ట్‌ అధికారులు, డా.సురే్‌షబాబు

రామకుప్పం, మే 30(ఆంధ్రజ్యోతి): మండల పరిధిలో ఏనుగుల దాడుల కట్డడికి అడవి మధ్యలోని గ్రామాల చుట్టూ త్వరలో సోలార్‌ హ్యాంగింగ్‌ ఫెన్సింగ్‌ ఏర్పాటు చేయనున్నట్టు కుప్పం అటవీ రేంజ్‌ అధికారి జయశంకర్‌, పీకేఎం ఉడా చైర్మన్‌ డా.సురే్‌షబాబులు తెలిపారు. సోలార్‌ హ్యాంగింగ్‌ ఫెన్సింగ్‌కు మరమ్మతులు చేపడితేనే కట్టడి శీర్షికన ఆంధ్రజ్యోతిలో ప్రచురితమైన వార్తకు స్పందించి శనివారం వారు సోలార్‌ హ్యాంగింగ్‌ ఫెన్సింగ్‌ను పరిశీలించారు. అటవీ సరిహద్దుల్లో పూడిపోయిన కందకాలను పునరుద్ధరించాలని ఈసందర్భంగా రైతులు వారిని కోరారు. ఫెన్సింగ్‌కు మరమ్మతులు చేపట్టాలన్నారు. త్వరలోనే సోలార్‌ హ్యాంగింగ్‌ ఫెన్సింగ్‌కు మరమ్మతులు చేపట్టేందుకు చర్యలు తీసుకుంటామని అధికారులు సురే్‌షకు వివరించారు. ననియాలతండా, నారాయణపురంతండా,పంద్యాలమడుగు గ్రామాల చుట్టూ కొత్తగా 9 కిలోమీటర్ల సోలార్‌ హ్యాంగింగ్‌ ఫెన్సింగ్‌ ఏర్పాటుకు ప్రతిపాదిస్తున్నామన్నారు. నష్టపరిహారం తొందరగా అందేలా చూస్తామన్నారు. రెస్కో డైరెక్టరు మనోహర్‌, టీడీపీ యూనిట్‌ ఇన్‌చార్జి గజేంద్ర, పంచాయతీ అధ్యక్షుడు లోకేశ్‌నాయుడు, నేతలు జీఎ్‌సబాబు, వేణు, గంగాధరం, త్యాగరాజు, సామూనాయక్‌ పాల్గొన్నారు. కాగా ననియాల సమీపాన బీన్స్‌ తోటను శుక్రవారం రాత్రి జంట ఏనుగులు పాక్షికంగా తొక్కి ధ్వంసం చేశాయి. మామిడి చెట్ల కొమ్మలను విరిచేశాయి. కాయలను నేలరాల్చాయి. అటవీ అధికారులు, బేస్‌క్యాంపు సిబ్బంది చేరుకుని ఏనుగులను అడవిలోకి తరిమేశారు.

Updated Date - May 31 , 2026 | 12:36 AM