ప్రజల సౌకర్యార్థం చేపట్టిన బస్సు షెల్టర్ నిర్మాణం మధ్యలోనే నిలిచిపోవడంతో నేమకల్లు గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎంపీ అంబికా లక్ష్మీనారాయ ణ రూ. 5 లక్షలు మంజూరు చేయగా దాదాపు మూడు నెలల క్రితం పనులు ప్రారంభించారు.
రాయలచెరువు రైల్వేస్టేషనలో ధర్మవరం ఎక్స్‌ప్రెస్, ఎగ్మోర్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను ఆపేలా చర్యలు చేపట్టాలని కోరుతూ ఎంపీ అంబికా లక్ష్మీనారాయణకు మండలవా సులు వినతిప త్రం అందజేశారు. అనంతపురంలోని కార్యాలయంలో ఎంపీని శుక్రవారం కలిసి వినతిపత్రం అందజేశారు.
ఉపాధ్యాయుల సమస్యలపై సీఎం చంద్రబాబు నాయుడు, రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నా రా లోకేశ ప్రత్యేక దృష్టి సారించారని ఎమ్మెల్యే అమిలి నేని సురేంద్ర బాబు పేర్కొన్నారు. 2004 కంటే ముందు ఉపాధ్యాయులుగా పొందిన వారికి రాష్ట్ర ప్రభుత్వం పాత పెన్షన విధానం అమలు చేసినందుకు గాను శుక్రవారం పట్టణంలోని ప్రజా వేదిక వద్ద కృతజ్ఞత సభను నిర్వహించారు.
టీడీపీని అప్రతిష్టపాలు చేయటానికి కొందరు ప్రయత్నిస్తున్నారని ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు ఆరోపించారు. తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో శుక్రవారం నిర్వహిం చిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ వివిధ పార్టీల ముసుగులో ఉన్న కొంతమంది టీడీపీకి ఇబ్బంది కలిగించే ప్రయత్నాలు చేస్తున్నాయ ని, వాటిని సమర్థవంతంగా తిప్పికొట్టాలన్నారు.
పట్టణంలోని ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో కనీస సౌకర్యాలు లేక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. 2009లో బాలికల జూనియర్ కళాశాలను ఏర్పాటు చేశారు. ప్రారంభం నుంచి ఆ కళాశాల బాలుర కళాశాల గదుల్లోనే నిర్వహించుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. ఎంపీసీ, బైపీసీ, హెచఈసీ, సీఈసీ, ఎంఈసీ, ఎంబైపీసీ కోర్సులలో 370మంది దాకా విద్యార్థులు చదువుకుంటున్నారు.
అనంతపురం జిల్లా తాడిపత్రిలో మరోసారి హైటెన్షన్ వాతావరణం నెలకొంది. మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి భగత్‌సింగ్ నగర్‌లోని తన నివాసం ఎదుట బైఠాయించి నిరసనకు దిగారు.
అనంతపురం జిల్లా తాడిపత్రిలో మరోసారి రాజకీయ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. నిరసన కార్యక్రమాలు చేపట్టేందుకు మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి సిద్ధమవడంతో పోలీసులు ఆయనను గృహ నిర్బంధం చేశారు.
ఉరవకొండ మండలం బూదగవి సమీపంలోని జాతీయ రహదారిపై గ్రానైట్ లారీ బోల్తా పడి.. చెట్టును ఢీకొట్టింది. ఈ ఘటనలో డ్రైవర్ సజీవదహనం అయ్యాడు.
కూరగాయల ధరలు పైపైకి పెరిగిపోతున్నాయి. రెండు వారాల వ్యవధిలో ధరల్లో భారీ పెరుగుదల చోటు చేసుకుంది.
వైసీపీ చేసిన పా పాలన్నీ ప్రజల పాలిట శాపాలుగా మారి, నిత్యం ఇబ్బందులకు గుర వుతున్నారని ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు విమర్శించారు. ఆ యన బుధవారం పట్టణంలోని ప్రజావేదిక వద్ద ప్రజాదర్బార్ ని ర్వహించారు. నియోజవర్గంలోని వివిధ గ్రామాల నుంచి సమస్యల పరిష్కారం కోసం వచ్చిన ప్రజలతో అర్జీలను స్వీకరించారు.