Share News

BOMB: కోర్టులలో బాంబు బూచి

ABN , Publish Date - Feb 18 , 2026 | 11:54 PM

కోర్టులో బాంబు ఉందంటూ మధ్యాహ్నం 12గంటల ప్రాంతంలో మెసేజీ రావడంతో స్థానిక జేఎఫ్‌సీఎం కోర్టులో బుధవారం ఉదయం ఉన్నట్లుండి కలకలం చెలరేగింది. కోర్టులో నుంచి న్యాయమూర్తి, న్యాయవాదులు, కక్షిదారులు బైటకు వచ్చేశారు. పోలీసు శాఖ అప్రమత్తమై రైల్వే ఆర్పీఎఫ్‌ నుంచి జాగిలాన్ని రప్పించి కోర్టులో తనిఖీలను నిర్వహించారు.

BOMB: కోర్టులలో బాంబు బూచి
Guntakallu policemen are running around in the court

గుంతకల్లు, ఫిబ్రవరి 18 (ఆంధ్రజ్యోతి): కోర్టులో బాంబు ఉందంటూ మధ్యాహ్నం 12గంటల ప్రాంతంలో మెసేజీ రావడంతో స్థానిక జేఎఫ్‌సీఎం కోర్టులో బుధవారం ఉదయం ఉన్నట్లుండి కలకలం చెలరేగింది. కోర్టులో నుంచి న్యాయమూర్తి, న్యాయవాదులు, కక్షిదారులు బైటకు వచ్చేశారు. పోలీసు శాఖ అప్రమత్తమై రైల్వే ఆర్పీఎఫ్‌ నుంచి జాగిలాన్ని రప్పించి కోర్టులో తనిఖీలను నిర్వహించారు. మధ్యాహ్నం వరకూ కోర్టు, రికార్డు రూము, బార్‌ రూము, కోర్టు పైభాగం, ఆవరణలో తనిఖీలు చేశారు. ఎటువంటి పేలుడు పదార్థాలు లభ్యం కాకపోవడంతో డాగ్‌ స్క్వాడ్‌ వెళ్లిపోయింది.


రాష్ట్రంలో పలుచోట్ల కోర్టుల్లో తనిఖీలు జరగడంతో ఇది మాక్‌ డ్రిల్‌లో భాగమని స్థానికులు భావించారు. సాయంత్రం వరకూ కోర్టు విధులు పునః ప్రారంభంకాలేదు.

ఉరవకొండ: కోర్టులో బాంబులు పెట్టారన్న మెయిల్‌తో స్థానిక కోర్టులో నుంచి న్యాయమూర్తి, న్యాయవాదులు, సిబ్బంది అంతా బయ టకు వచ్చారు. ఉరవకొండ కోర్టుకు జిల్లా కోర్టు నుంచి బుధవారం మె యిల్‌ రావడంతో ముందస్తుగా అప్రమత్తం చేశారు. బెంచ నిర్వహి స్తున్న సమయంలో మెయిల్‌ రావడంతో విధుల్లో ఉన్న వారంతా కోర్టు ఆవరణంలోకి వచ్చారు. పోలీసులు కోర్టు ఆరణానికి చేరుకున్నారు. దీంతో సుమారుగా మూడు గంటల పాటు సిబ్బంది బయటనే నిరీక్షించారు. బాంబులు లేవని తేలడంతో మధ్యాహ్నం 2:30గంటల తర్వాత న్యాయమూర్తి, సిబ్బంది అంతా విధులకు హాజరయ్యారు.


అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....

Updated Date - Feb 18 , 2026 | 11:54 PM