Share News

COMPETITIONS: ఉత్సాహంగా రాతిదూలం లాగుడు పోటీలు

ABN , Publish Date - Feb 18 , 2026 | 11:50 PM

మండలంలోని గోవిం దవాడ గ్రామంలో ఎణ్ణే రంగనాథేశ్వర స్వామి ఉత్సవాల సందర్భంగా టీడీపీ స్థానిక నాయకులు సోమనాథ్‌గౌడ్‌, కటెంబ్లీ సుంకన్న, ఎస్‌.జీ వన్నూరుస్వామి ఆధ్వర్యంలో బుధవారం రాతిదూలం లాగుడు పోటీల ను ఉత్సాహంగా నిర్వహించారు. సింగల్‌ విండో చైర్మన కొత్తపల్లి మల్లికా ర్జున, టీడీపీ నాయకులు తిమ్మరాజు పోటీలను ప్రారంభించారు.

COMPETITIONS: ఉత్సాహంగా రాతిదూలం లాగుడు పోటీలు
TDP leaders starting contests

బొమ్మనహాళ్‌, ఫిబ్రవరి 18(ఆంధ్రజ్యోతి): మండలంలోని గోవిం దవాడ గ్రామంలో ఎణ్ణే రంగనాథేశ్వర స్వామి ఉత్సవాల సందర్భంగా టీడీపీ స్థానిక నాయకులు సోమనాథ్‌గౌడ్‌, కటెంబ్లీ సుంకన్న, ఎస్‌.జీ వన్నూరుస్వామి ఆధ్వర్యంలో బుధవారం రాతిదూలం లాగుడు పోటీల ను ఉత్సాహంగా నిర్వహించారు. సింగల్‌ విండో చైర్మన కొత్తపల్లి మల్లికా ర్జున, టీడీపీ నాయకులు తిమ్మరాజు పోటీలను ప్రారంభించారు. ఏడు జ తల వృషభాలు పాల్గొన్నాయి. అందులో గోవిందవాడకు చెందిన తిప్పే స్వామి వృషభాలు ప్రథమ స్థానంలో, లింగదహాళ్‌ గ్రామానికి చెందిన ఎర్రిస్వామి వృషభాలు ద్వితీయ, గోవిందవాడకు చెందిన గురుస్వామి వృషభాలు మూడో స్థానంలో, నరసింహులు వృషభాలు నాలుగో స్థా నంలో నిలిచాయి. వాటి యజమానులకు వరుసగా రూ. 30వేలు, రూ. 20 వేలు, రూ. 15వేలు, రూ.10 వేలు నగదు బహుమతులను టీడీపీ నాయకులు అందజేశారు. గ్రామాల నుంచి పెద్దఎత్తున జనం తరలివ చ్చారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు పయ్యావుల మోహన, పయ్యావుల నాగరాజు, కొత్తపల్లి శీన, రాతింటి వన్నూరుస్వామి, వేమన్న, నటరాజ్‌, బంగిలోకేష్‌ తదితరులు పాల్గొన్నారు.


అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....

Updated Date - Feb 18 , 2026 | 11:50 PM