Share News

STUDENTS: బస్సు కోసం ఆందోళన

ABN , Publish Date - Feb 18 , 2026 | 11:45 PM

పాఠశాల వేళలకు అనుకూ లంగా విద్యార్థుల కోసం తమ గ్రామానికి ఉదయం 8.30 గంటలకు, సాయంత్రం 4.30 గంటలకు ఆర్టీసీ బస్సును నడపాలని ఎమ్మెల్యే కాల వ శ్రీనివాసులు సూచించినా ఆర్టీసీ స్థానిక డిపో మేనేజర్‌ పట్టించు కోవడం లేదంటూ విద్యార్థినులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు మండలపరిధిలోని నాగేపల్లి విద్యార్థినీలు బుధవారం ఆ గ్రామంలో రోడ్డుపై రాస్తారోకో చేపట్టారు.

STUDENTS: బస్సు కోసం ఆందోళన
Students protesting in front of RTC bus in Nagepally

- విద్యార్థినుల రాస్తారోకో

కణేకల్లు, ఫిబ్రవరి 18(ఆంధ్రజ్యోతి): పాఠశాల వేళలకు అనుకూ లంగా విద్యార్థుల కోసం తమ గ్రామానికి ఉదయం 8.30 గంటలకు, సాయంత్రం 4.30 గంటలకు ఆర్టీసీ బస్సును నడపాలని ఎమ్మెల్యే కాల వ శ్రీనివాసులు సూచించినా ఆర్టీసీ స్థానిక డిపో మేనేజర్‌ పట్టించు కోవడం లేదంటూ విద్యార్థినులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు మండలపరిధిలోని నాగేపల్లి విద్యార్థినీలు బుధవారం ఆ గ్రామంలో రోడ్డుపై రాస్తారోకో చేపట్టారు. మధ్యాహ్నం 12 గంటల సమయంలో వచ్చిన ఆర్టీసీ బస్సును అడ్డుకున్నారు. నాగేపల్లి నుంచి ప్రతి రోజూ మాల్యం గ్రామానికి దాదాపు 80 మంది విద్యార్థిని, విద్యార్థులు ఉన్నత పాఠశాలకు వెళుతున్నా రు. కానీ వీరికి ఉదయం, సాయంత్రం బస్సు సౌకర్యం అందుబాటులో లేదు. దీంతో వారు రోజూ హెచ్చెల్సీ గట్టుపై నడుచుకుంటూ ఐదు కి.మీ.లో ఉన్న మాల్యానికి వెళ్లి వస్తున్నారు. ఈ విషయాన్ని ఇటీవల నాగేపల్లికి వచ్చిన ప్రభుత్వ విప్‌, ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు దృష్టికి తీసుకెళ్లారు. ఆయన వెంటనే స్పందించి పాఠశాల సమయంలో బస్సు నడపాలని ఆర్టీసీ డిపో మేనేజర్‌ను ఫోనలో ఆదే శించారు. కానీ ఇప్పటి వరకు నాగేపల్లికి బస్సు ఏర్పాటు చేయకపోవ డంతో విధిలేక రాస్తారోకో చేపట్టినట్లు విద్యార్థిని, విద్యార్థులు తెలిపారు.


అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....

Updated Date - Feb 18 , 2026 | 11:45 PM