Share News

POLICE STATION: వేధిస్తున్న సిబ్బంది కొరత

ABN , Publish Date - Feb 18 , 2026 | 11:41 PM

మండలంలోని పాల్తూరు పోలీస్‌ స్టేషనను సిబ్బంది కొరత వేధిస్తోంది. స్టేనలో ఎప్పు డూ హెడ్‌ కానిస్టేబుల్‌ ఓబుళేసు తప్ప ఎవరూ ఉండరు. ఏదైన సమ స్య వస్తే స్టేషన పరిధిలోని ఐదు గ్రామాలకు ఆయన పెద్ద దిక్కుగా ఉంటున్నారు. పాల్తూరు రాష్ట్ర సరిహద్దు గ్రామం. దీంతో ఇక్కడి పోలీస్‌ స్టేషనలో విధులు నిర్వహించేందుకు సిబ్బంది ఎవరూ ఆసక్తి చూపడం లేదు.

POLICE STATION: వేధిస్తున్న సిబ్బంది కొరత
Paltoor Police Station

-పాల్తూరు పోలీస్‌ స్టేషనపై ఆసక్తి చూపని సిబ్బంది

- దొంగల భయంతో ఆందోళనలో మిరప రైతులు

విడపనకల్లు, ఫిబ్రవరి 18(ఆంధ్రజ్యోతి): మండలంలోని పాల్తూరు పోలీస్‌ స్టేషనను సిబ్బంది కొరత వేధిస్తోంది. స్టేనలో ఎప్పు డూ హెడ్‌ కానిస్టేబుల్‌ ఓబుళేసు తప్ప ఎవరూ ఉండరు. ఏదైన సమ స్య వస్తే స్టేషన పరిధిలోని ఐదు గ్రామాలకు ఆయన పెద్ద దిక్కుగా ఉంటున్నారు. పాల్తూరు రాష్ట్ర సరిహద్దు గ్రామం. దీంతో ఇక్కడి పోలీస్‌ స్టేషనలో విధులు నిర్వహించేందుకు సిబ్బంది ఎవరూ ఆసక్తి చూపడం లేదు. దీనికి తోడు ఇక్కడ విదులు నిర్వహిస్తున్న ఎస్‌ఐకి సిబ్బందికి పొసగటం లేదనే వాదనలు చాలా గట్టిగానే వినిపిస్తున్నాయి. ఈ కార ణంతోనూ ఇక్కడకు వచ్చిన సిబ్బంది బదిలీలపై లేదా డిప్యుటేషన నుపై వెళుతున్నారని పలువురు అనుకుంటున్నారు. స్ఠేషనలో మొత్తం 28 మంది సిబ్బంది ఉండాల్సి ఉంది. ఒక ఎస్‌ఐ, ఇద్దరు ఏఎస్‌ఐలు, నలుగురు హెడ్‌ కానిస్టేబుళ్లు, 21 మంది కానిస్టేబుళ్లు ఉండాలి. కానీ ఇక్కడ డ్యూటీలో ఎస్‌ఐ, ఇద్దరు హెడ్‌ కానిస్టేబుళ్లు, ముగ్గురు కానిస్టే బుళ్లు కలిపి మొత్తం ఆరుగురు విదులు నిర్వహిస్తున్నట్లు రికార్డులు చూపుతున్నాయి.


ఆ ఆరుగురిలోను ఎస్‌ఐతో పాటు ఒక హెడ్‌ కాని స్టేబుల్‌, ఒక కాని స్టేనిస్టేబుల్‌ మాత్రమే ప్రస్తుతం ఉన్నారు. మిగిలిన ముగ్గురు డూయింగ్‌ డ్యూటీలో వేరే ప్రాంతాల్లో ఉంటూ విధులు నిర్వహిస్తున్నారు. స్టేషనలో ఉన్న ముగ్గురిలోను ఎస్‌, కానిస్టేబుల్‌ బయటి ప్రాంతాలకు బందోబస్తుకు వెళుతున్నారు. ఇక మిగిలింది ఒక్కరే అతనే ఒకే ఒక్కడు హెడ్‌ కానిస్టేబుల్‌ ఓబుళేసు. ఏ గ్రామంలో ఏమి జరిగినా ఆయన స్టేషన వదిలిపెట్టి వెళ్లే పరిస్థితి ఉండదు. దీంతో పాల్తూరు పోలీస్‌ స్టేషన పరిధిలో దొంగలకు ఎదురు లేకుండా పోతోం దనే విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం పాల్తూరు స్టేషన పరిధిలోని వివిధ గ్రామాల్లో మిరప సాగు చేసిన రైతులకు ఎన్నడు లేని విధంగా దొంగల బెడత అధికమైంది. దీంతో రైతులు రాత్రి అయితే చాలు మిరప పొలాల వద్ద మంటలు వేసుకుని, కాపలా ఉండాల్సి వస్తోంది.

సీఐ వివరణ

ఈ విషయమై ఉరవకొండ ఇనచార్జి సీఐ మహానందిని విచారించగా పాల్తూరు పోలీస్‌ స్టేషనలో సిబ్బంది కొరత ఉన్న మాట వాస్తవమే అన్నారు. అక్కడ విధులకు సిబ్బందిని కేటా యించినా కొన్ని రోజులు పనిచేసి, ఏదో ఒక కారణంతో బదిలీ చేయించుకుని వెషళుతున్నారని తెలిపారు. గుంతకల్లు డీఎస్సీతో చర్చించి పాల్తూరు పోలీస్‌ స్టేనకు సిబ్బందిని పెంచుతామని తెలిపారు. రాత్రిళ్లు పొలాల్లో పోలీసుల గస్తీ ముమ్మరం చేస్తామన్నారు. ఎస్‌ఐకి సిబ్బందికి సరైన సఖ్యత లేక పోవటంపై విచారించి తగిన చర్యలు చేపడుతామని అన్నారు.


అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....

Updated Date - Feb 18 , 2026 | 11:41 PM