టీచర్ల క్రికెట్ జట్టుకు కలెక్టర్ అభినందన
ABN , Publish Date - Feb 18 , 2026 | 11:57 PM
ఇటీవల నిర్వహించిన రాష్ట్రస్థాయి టీచర్ల క్రికెట్‌టోర్నీలో విజయం సాధించిన జిల్లాజట్టును కలెక్టర్ శ్యాంప్రసాద్ అభినందించారు
పుట్టపర్తి టౌన, ఫిబ్రవరి 18(ఆంధ్రజ్యోతి): ఇటీవల నిర్వహించిన రాష్ట్రస్థాయి టీచర్ల క్రికెట్‌టోర్నీలో విజయం సాధించిన జిల్లాజట్టును కలెక్టర్ శ్యాంప్రసాద్ అభినందించారు. కలెక్టరేట్‌లో బుధవారంఏర్పాటు చేసిన అభినందన సభలో ఆ జట్టును కలెక్టర్ సన్మానించారు. ఇందులో డీఈఓ కిష్టప్ప, పెనుకొండ డీవైఈఓ జాన రెడ్డప్ప, ధర్మవరం ఎం ఈఓ గోపాల్ నాయక్, స్కూల్‌గేమ్స్ కార్యదర్శి లక్ష్మీనారాయణ పాల్గొన్నారు.