మైనింగ్ తవ్వకాలు వద్దు
ABN , Publish Date - Feb 18 , 2026 | 11:53 PM
మైనింగ్ తవ్వకాలంతో తాము నష్టపోతామని మండలంలోని మల్లమీదపల్లి పంచాయతీ కుమ్మరవాండ్లపల్లి గ్రామంలో బుధవారం నిర్వహించిన పర్యావరణ ప్రజా సేకరణ సభలో రైతులు స్పష్టం చేశారు.
గాండ్లపెంట, ఫిబ్రవరి 18(ఆంధ్రజ్యోతి): మైనింగ్ తవ్వకాలంతో తాము నష్టపోతామని మండలంలోని మల్లమీదపల్లి పంచాయతీ కుమ్మరవాండ్లపల్లి గ్రామంలో బుధవారం నిర్వహించిన పర్యావరణ ప్రజా సేకరణ సభలో రైతులు స్పష్టం చేశారు. కుమ్మరవాండ్లపల్లి గ్రామ పరిసర ప్రాంతాల్లోనీ బోడికొండలో వరసిద్ధి వినాయక మినరల్స్ వారికి 1005 సర్వే నెంబర్‌లో 8.69 హెక్టార్లు , అదే సర్వే నెంబర్లు 10 హెక్టార్లలో మైన్స అండ్ జియాలజీ వారు 20 సంవత్సరాల వరకు తవ్వుకునేందుకు అనుమతులు ఇచ్చారు. ఈ సందర్భంగా ఆ గ్రామంలోని రైతులు, ప్రజల అభిప్రాయసేకరణకు జిల్లా పర్యావరణ అధికారి శశికల, కదిరి రెవెన్యూ డివిజన అధికారి వీవీఎస్ శర్మ బుధవారం సమావేశం నిర్వహించారు. మైనింగ్ ఏర్పాటు చేస్తే దుమ్ము, దూళీతో పంటలు నష్టపోతామని రైతులు వాపోయారు. తమ గ్రామ పరిధిలో మైనింగ్ అవసరం లేదని తేల్చిచెప్పారు. ఇందులో తహసీల్దార్ బాబురావు, వీఆర్‌ఓ రామ్మోహన, మండల మాజీ కన్వీనర్ కొండయ్య పాల్గొన్నారు.