Share News

ధర్మవరం కోర్టులో బాంబు కలకలం

ABN , Publish Date - Feb 18 , 2026 | 11:54 PM

ధర్మవరం కోర్టులో ఆర్డీఎక్స్‌ బాంబు పెట్టామని.. ఆ బాంబు మధ్యాహ్నం 12.05 గంటలకు పేలుతుందని జిల్లా కోర్టుకు బుధవారం మెయిల్‌ రావడంతో ఒక్కసారిగా కలకలం రేపింది.

ధర్మవరం కోర్టులో బాంబు కలకలం
కోర్టు ఆవరణలో తనిఖీలు చేస్తున్న సిబ్బంది

ధర్మవరం, ఫిబ్రవరి 18(ఆంధ్రజ్యోతి): ధర్మవరం కోర్టులో ఆర్డీఎక్స్‌ బాంబు పెట్టామని.. ఆ బాంబు మధ్యాహ్నం 12.05 గంటలకు పేలుతుందని జిల్లా కోర్టుకు బుధవారం మెయిల్‌ రావడంతో ఒక్కసారిగా కలకలం రేపింది. దీంతో సీనియర్‌, జూనియర్‌ జడ్జీలు, న్యాయవాదులు, కక్షిదారులు బయటకు పరుగులు తీశారు. వనటౌన సీఐ నాగేంద్రప్రసాద్‌ తన సిబ్బందితో కోర్టు వద్దకు చేరుకొని.. ఎస్పీ సతీశకుమార్‌, డీఎస్పీ హేమంతకుమార్‌కు సమాచారం ఇచ్చారు. బాంబుస్వ్కాడ్‌, జాగిలాలు కోర్టు, కోర్టు పరిసర ప్రాంతాల్లో గంట పాటు తనిఖీలు నిర్వహించారు. ఎలాంటి పేలుడు పదార్థాలూ లభించకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఆ మెయిల్‌ ఎవరు పంపారు.. ఎక్కడి నుంచి వచ్చింది.. అనే దానిపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Updated Date - Feb 18 , 2026 | 11:54 PM