Share News

‘సంస్కృతి’కి అరుదైన గౌరవం

ABN , Publish Date - Feb 18 , 2026 | 11:55 PM

విద్యారంగంలో ప్రముఖసంస్థలైన ఎంటర్‌ప్రెనర్‌ ఇండియా, ఎర్ట్న్స్‌ యంగ్‌ ఎడ్యుకేషన లీడర్‌షిప్‌ అవార్డు - 2026ను స్థానిక సంస్కృతిగ్రూప్‌ ఆఫ్‌ ఇనస్టిట్యూషన్సకు దక్కిం ది.

‘సంస్కృతి’కి అరుదైన గౌరవం
విశిష్ట పురస్కారాలతో అధ్యాపకులు, విద్యార్థులు

పుట్టపర్తిరూరల్‌, ఫిబ్రవరి 18(ఆంధ్రజ్యోతి): విద్యారంగంలో ప్రముఖసంస్థలైన ఎంటర్‌ప్రెనర్‌ ఇండియా, ఎర్ట్న్స్‌ యంగ్‌ ఎడ్యుకేషన లీడర్‌షిప్‌ అవార్డు - 2026ను స్థానిక సంస్కృతిగ్రూప్‌ ఆఫ్‌ ఇనస్టిట్యూషన్సకు దక్కిం ది. ఈ అవార్డును చెన్నైలో మంగళవారం రాత్రి చైర్మన విజయభాస్కర్‌రెడ్డికి ఆ సంస్థల ప్రతినిధులు అందజేశారు. ఈ మేరకు బుధవారం స్థానిక సంస్కృతిగ్రూప్‌ ఆఫ్‌ ఇనస్టిట్యూషన్సలో బుధవారం సంబరాలు నిర్వహించారు. చైర్మన, డీన బాలకోటేశ్వరి మాట్లాడుతూ.. దక్షణ భారతదేశంలో ఈ కేటగిరిలో అవార్డు పొందిన ఏకైక విద్యాసంస్థగా తమదేనన్నారు. నాణ్యమైన విద్యాబోధన, ఆధునిక సాంకేతిక విద్య, స్టార్టప్‌ ఇన్నోవేషన కార్యక్రమాలు, పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా విద్యార్థులకు శిక్షణతో తమకు ఈ గుర్తింపు లభించిందన్నారు.

Updated Date - Feb 18 , 2026 | 11:55 PM