Share News

ఆలయానికి రహదారి ఏర్పాటు చేయండి

ABN , Publish Date - Feb 18 , 2026 | 11:58 PM

మండలంలోని నల్లగొండ ఎనుములవారి పల్లి సమీపంలో ఉన్న నరసింహస్వామి ఆలయానికి (దేవరగుళ్లకు) సిమెంటు రోడ్డు ఏర్పాటు చేయాలని గ్రామస్థులు, భక్తులు కోరుతున్నారు.

ఆలయానికి రహదారి ఏర్పాటు చేయండి
నరసింహస్వామి ఆలయ దారి

నల్లమాడ, ఫిబ్రవరి 18(ఆంధ్రజ్యోతి): మండలంలోని నల్లగొండ ఎనుములవారి పల్లి సమీపంలో ఉన్న నరసింహస్వామి ఆలయానికి (దేవరగుళ్లకు) సిమెంటు రోడ్డు ఏర్పాటు చేయాలని గ్రామస్థులు, భక్తులు కోరుతున్నారు. చండ్రాయునిపల్లి నుంచి కదిరికి వెళ్తే ప్రధాన రహదారి నుంచి ఆ ఆలయం రెండు కిలోమీటర్ల దూరంలో, గుట్టల మధ్యలో ఉంది. ప్రధాన రహదా రి నుంచి ఆలయం వ రకు తారు రోడ్డు ని ర్మించారు. అయితే తా రు రోడ్డు నుంచి ఆల యం వందమీటర్ల దూరంలో ఉంది. ఇక్క డ రోడ్డు వేయకపోవడంతో .. భక్తులు రా ళ్లపై ఆలయం వద్దకు వెళ్లడానికి ఇబ్బందులు పడుతున్నారు.

Updated Date - Feb 18 , 2026 | 11:58 PM