ఇంటింటికి టీడీపీ కా ర్యక్రమంలో పార్టీ నాయకులు ఇప్పటివరకు నియోజకవర్గ వ్యాప్తంగా 70 శాతం ఇళ్లను సందర్శించి ప్రజలతో నేరుగా మాట్లాడినట్లు ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు తెలిపారు.
మండల కేంద్రంలోని ఎస్ఎస్ ట్యాంక్ కా ర్యాలయ ప్రాంగణంలోను, ఫిల్టర్ బెడ్ల వద్ద మద్యం బాబులు రోజూ హంగామా చేస్తున్నారు. విచ్చల విడిగా మద్యం తాగు తూ చెరువు మొత్తాన్ని కలుషితం చేస్తున్నారు. 11 గ్రామాలకు తాగు నీ రు అందించే ట్యాంక్ వద్ద వివిధ గ్రామాలకు చెందిన మద్యం ప్రియులు కర్ణాటక, ఆంధ్ర మద్యం తెచ్చుకుని తాగి హంగామా చేస్తున్నారు.
పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్లో పల్లెవెలుగు బస్సు నమూనాను మంగళవారం ఆర్టీసీ అధికా రులు ఏర్పాటుచేశారు. దానికి ఆర్టీసీ డీఎం ఖాజావలి ప్రారంభించి మా ట్లాడుతూ బస్టాండు సుందరీకరణలో భాగంగా బస్సు నమూనా ఏర్పాటు చేశామని తెలిపారు.
మండలంలోని నేమక ల్లు గ్రామంలో బాలాలయంలో వెలసిన ఆంజనేయ్వస్వామి దర్శనానికి భక్తులు పోటెత్తారు. శ్రావణమాసం మూడో మంగళవారం సం దర్భంగా స్వామివారికి ప్రధాన అర్చకులు అనిల్కుమార్చార్యులు విశేషపూజలు నిర్వహించారు.
పట్టణ నడి బొడ్డున జీఎస్బీసీ మురుగు కాలువలా మారింది. ఇళ్లలోని మురుగు నీ టిని కాలువలోకి వదులుతుండడంతో మురుగునీటితో నిండి పోయింది. దాని నుంచి వచ్చే దుర్వాసనతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అదేవిధంగా కాలవ చెత్తాచెదారం, ముళ్లకంపలతో నిండిపోయింది. పట్ట ణ శివారులోని సీఐటీయూ కాలనీ నుంచి భీమిరెడ్డి కాలనీ వరకు కాలు వకు ఇరువైపులా నివాసముంటున్నారు.
ఆశల పంట నష్టాల మూటగా మారింది. టమోటా ధరలు భారీగా పతనమయ్యాయి.
మైనర్ను వివస్త్రగా మార్చి పూజలు చేసిన అమానుష ఘటన అనంతపురం జిల్లాలో చోటు చేసుకుంది. పూజల పేరుతో బాలికను ఓ మహిళ చిత్రహింసలకు గురిచేయడం తీవ్ర కలకలం రేపుతోంది.
అనంతపురం హైవేపై ఓ ఇన్నోవా వాహనం అదుపుతప్పి బోల్తాపడింది. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందగా, మరో ఇద్దరు గాయపడ్డారు.
ఉమ్మడి అనంతపురం జిల్లా కక్కలపల్లిలోని మార్కెట్లో కిలో టమోటా గరిష్ఠంగా రూ.20తో అమ్ముడుపోయినట్లు రాప్తాడు మార్కెట్ ఇన్చార్జ్ కార్యదర్శి మల్లికా తెలిపారు.
మగ్గం నేసే ప్రతి నేతన్నకూ నేతన్నల సేవలో పథకం అందజేస్తామని మంత్రి సవిత స్పష్టం చేశారు. మొదటి విడతలో 71,536 మంది నేతన్నలకు రూ.25 వేల ఆర్థిక సాయం అందించామని తెలిపారు.