FESTIVALS: వైభవంగా రథోత్సవాలు
ABN , Publish Date - Feb 22 , 2026 | 11:54 PM
మండలంలోని పా ల్తూరులో సుంకులా పార్వతీ దేవి రథోత్సవాన్ని ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఉదయం అమ్మవారిని ప్రత్యేక పూలతో అలంక రించి పూజలు చేశారు. అనంతరం ఆలయం లో కుంకుమా ర్చన చేశారు.
విడపనకల్లు, ఫిబ్రవరి 22(ఆంధ్రజ్యోతి): మండలంలోని పా ల్తూరులో సుంకులా పార్వతీ దేవి రథోత్సవాన్ని ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఉదయం అమ్మవారిని ప్రత్యేక పూలతో అలంక రించి పూజలు చేశారు. అనంతరం ఆలయంలో కుంకుమా ర్చన చేశారు. అమ్మవారికి మొక్కుచెల్లించే నిమిత్తం రథానికి కట్టేందు కు భక్తులు గజమాలలను సాయంత్రం మేళతాళాలతో ఊరేగింపుగా ట్రాక్టర్లలో తీసుకొచ్చారు. గ్రామపెద్దలు, పోలీస్ అధికారుల అద్వర్యంలో సుంకులా పార్వతీ దేవి ఉత్సవమూర్తిని ఊరేగింపుగా తీసుకొచ్చి రథంలో కొలువు దీర్చారు. అనంతరం ఆలయం వద్ద నుంచి పాత పోలీస్ స్టేషన వరకు వేలాది మంది భక్తుల నడుమ రథాన్నిలాగారు. తిరిగి అమ్మవారి గుడి వద్దకు చేరుకోవటంతో రథోత్సవం ముగిసింది. ఉరవకొండ సీఐ మహానంది, విడపనకల్లు, బెళుగుప్ప, ఎస్‌ఐలు ఖజాహుస్సేన , జీ శివ, ఏస్‌ఐ లు శివప్రసాద్, పాల్, సర్కిల్‌లోని పోలీస్ సిబ్బంది తదితరులు బందోబస్తులో పాల్గొన్నారు.
కుందుర్పి: భక్తులు కొంగుబం గారంగా కొలిచే మండల పరిధిలోని వడ్డేపాల్యంలో వెలిసిన గుడిబండ వీరాంజనేయస్వామి రథోత్సవాన్ని ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఆలయంలో ఉదయం ప్రత్యేక పూజలు, హోమాలు నిర్వహించారు. 11 గంటలకు వేదపండితుల మంత్రోచ్ఛారణ, మేళతాళాలతో స్వామివారి ఉత్సవ మూర్తులను రథం పై వుంచారు.
అశేష జన సందోహం మధ్య స్వామి వారి నామస్మరణ చేస్తూ రథాన్ని లాగారు. భక్తులు రథంపైకి అరటిపండ్లు, పూలహారాలు విసిరి మొక్కులు తీర్చుకున్నారు. టీడీపీ మండల ఇనచార్జ్ ధర్మతేజ రథోత్సవంలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. రథోత్సవాన్ని తిలకించడానికి భక్తులు పెద్దఎత్తున తరలివచ్చారు. ఎస్‌ఐ మహేష్ గట్టి బందోబస్తు నిర్వహించారు.
ఉరవకొండ: మండల పరిధిలోని నింబగల్లు గ్రామంలో ఆదివా రం గురుసిద్ధావదూతల రథోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మఠంలో సిద్ధావదూతల మూలవిరాట్లకు అభిషేకాలు, ప్రత్యేక పూజలు చేశారు. సాయంత్రం ఉత్సవ మూర్తులను రథంపై ఉంచి ఊరు బావి వరకూ లాగారు. తిరిగి యఽథాస్థానానికి చేర్చారు. భక్తులు రథంపైకి అరటి పళ్లు విసిరి మొక్కులు తీర్చుకున్నారు. ఈ రథోత్సవాన్ని తిలకించేందుకు చుట్టుపక్కల గ్రామాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చిరు. అలాగే భగళాముఖి అమ్మవారికి పూజలు చేశారు.
అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....