Share News

ఆదమరిస్తే అంతే సంగతి..!

ABN , Publish Date - Feb 23 , 2026 | 12:15 AM

మండలంలోని చౌటకుంటపల్లి గ్రామ సమీపంలో కదిరి నుంచి చౌటకుంటపల్లికి వెళ్లే ప్రధాన రహదారి ఉంది. ఈరహ దారి పక్కనే మూడు పాడుబడిన మూడు పెద్దబావులున్నాయి.

ఆదమరిస్తే అంతే సంగతి..!
రోడ్డు పక్కనే ఉన్న బావి

నల్లమాడ, ఫిబ్రవరి 22 (ఆంధ్రజ్యోతి) : మండలంలోని చౌటకుంటపల్లి గ్రామ సమీపంలో కదిరి నుంచి చౌటకుంటపల్లికి వెళ్లే ప్రధాన రహదారి ఉంది. ఈరహ దారి పక్కనే మూడు పాడుబడిన మూడు పెద్దబావులున్నాయి. ఈ రోడ్డులో కదిరి నుంచి నల్లమాడకు వచ్చే ఆర్టీసీ బస్సు, ఆటోలు, ద్విచక్రవాహనదాలు అధికంగా తిరుగుతుంటాయి. ఆదమరిస్తే పెద్ద ప్రమాదమే జరిగే అవకాశముంది. కదిరి నుంచి వచ్చే సమయంలో రోడ్డు అంతా వాలుగా ఉంది. వాహనాలు వేగంగా వస్తుంటాయి. రోడ్డుకు ఆనుకునే పెద్ద ఆరుమట్లు ఉన్న పాడుపడిన కంసల్లోలబావి ఉంది. ఇటీవల రోడ్డును తార్‌రోడ్డు వేశారు. దీంతో వాహనాలు రద్దీ ఎక్కువగా ఉంది. ఏప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందో అని ప్రజలు భయపడుతున్నారు. బావిలోకి పడితే ప్రాణాలు గాలిలో కలవాల్సిందే. ఇలాంటి ప్రమాదకరమైన పాడు బావులకు పూడ్చివేయాలని చౌటకుంటపల్లి గ్రామస్థులు కోరుతున్నారు.

Updated Date - Feb 23 , 2026 | 12:15 AM