Share News

తాగునీరు వృథా

ABN , Publish Date - Feb 23 , 2026 | 12:19 AM

మద్దెల చెరువు నుంచి కునుకుంట్లకు వెళ్లే దారిలో తాగునీటి పైప్‌లైన లీక్‌ అయి నీరు వృథా అవుతోంది

తాగునీరు వృథా
రోడ్డుపై పారుతున్న తాగునీరు

తాడిమర్రి ఫిబ్రవరి 22(ఆంధ్రజ్యోతి): మద్దెల చెరువు నుంచి కునుకుంట్లకు వెళ్లే దారిలో తాగునీటి పైప్‌లైన లీక్‌ అయి నీరు వృథా అవుతోంది. ఇలా ఒక రోజు నుంచి కాదు.. రెండు రోజుల నుం చీ కాదు.. ఏకంగా పది రోజుల నుంచి నీరు వృథా అవుతూనే ఉంది. ఇలా ఈ నీరు రోడ్లపై పారుతుండటంతో అవి కూడా దెబ్బతింటున్నాయి. అసలే వేసవి మొదలైంది. నీటి సమస్యతో పలు గ్రామస్థులు ఇబ్బందులు పడుతున్నారు. ఇలాంటి సమయంలో పది రోజులుగా తాగునీరు వృథా అవుతున్నా.. అధికారులు పట్టించుకోకపోవడంపై మద్దెలచెరువు గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Updated Date - Feb 23 , 2026 | 12:19 AM