ROAD: వంతెనల నిర్మాణం ఎప్పుడో..?
ABN , Publish Date - Feb 23 , 2026 | 12:07 AM
హంద్రీనీవా కాలువ డిస్ర్టిబ్యూటరీల కాలువలపై ఏళ్లు గడుస్తున్నా వంతెనల నిర్మాణానికి మోక్షం లభించడంలేదు. దీంతో తాత్కాలికంగా ఏర్పాటు చేసిన రోడ్ల పైనే వాహనదారులు రాకపోకలు సాగిస్తున్నారు. ప్రధానంగా ఉరవకొం డ- గుంతకల్లు, ఉరవకొండ- హోతూరు, ఉరవకొండ- చాబాల రహ దారులు ప్రమాదకరంగా మారాయి.
ఉరవకొండ, ఫిబ్రవరి 22(ఆంధ్రజ్యోతి): హంద్రీనీవా కాలువ డిస్ర్టిబ్యూటరీల కాలువలపై ఏళ్లు గడుస్తున్నా వంతెనల నిర్మాణానికి మోక్షం లభించడంలేదు. దీంతో తాత్కాలికంగా ఏర్పాటు చేసిన రోడ్ల పైనే వాహనదారులు రాకపోకలు సాగిస్తున్నారు. ప్రధానంగా ఉరవకొం డ- గుంతకల్లు, ఉరవకొండ- హోతూరు, ఉరవకొండ- చాబాల రహ దారులు ప్రమాదకరంగా మారాయి. ఆయా దారు ల్లో వంతెనల నిర్మా ణం చేపట్టకపోవడం వల్ల తరచూ ప్రమాదాలు చోటు చేసుకుంటున్నా యి. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో వాటి గురించి పట్టించుకున్న దా ఖాలాలు లేవు. ఉరవకొండ- గుంతకల్లు రహదారిపై వంతెన నిర్మాణం చేపట్టాల్సిన చోట ఉన్న గుంత ప్రమాదకరంగా ఉంది. దీంతో వాహన దారులు తరచూ ప్రమాదాలకు గురవుతున్నారు.
అలాగే ఉరవకొండ- హోతూరు రహదారిలో వంతెన నిర్మాణం చేపట్టలేదు. గత ఏడాది నవంబరు 17వ తేదీన కాలువ వద్ద ఆటో బోల్తాపడిన ఘటనలో ఒకరు మృతి చెందగా పలువురికి గాయాలు అయ్యాయి. అలాగే కాలువ వద్ద తరచూ ద్విచక్రవాహనాలు, ఆటోలు ప్రమాదాలకు గురవుతున్నాయి. ఉరవకొండ- చాబాల రహదారిలో వంతెన నిర్మించకపోవడం వల్ల కాలువలోకి ద్విచక్రవాహనం దూసుకెళ్లి వాహనదా రుడికి గాయాల య్యాయి. ఇప్పటికైనా అధికారులు స్పందించి ఆయా దారుల్లో కల్వరులు నిర్మాంచాలని వాహనదారులు కోరుతున్నారు. ఈ విషయంపై హెచఎనఎస్‌ఎస్ ఈఈ శ్రీనివాస్‌ను వివరణ కోరగా... ఆయా దారుల్లో వంతెనల నిర్మాణం కోసం ప్రభుత్వానికి ప్రతిపాద నలు పంపామని తెలిపారు. ప్రభుత్వం నుంచి అనుమతులు రాగానే నిర్మాణాలు చేపడతామని ఆయన వివరించారు.
అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....