రైస్ పుల్లింగ్ కేసులో వైసీపీ నేత అరెస్టు..
ABN , Publish Date - Feb 22 , 2026 | 07:54 PM
రైస్ పుల్లింగ్ కేసులో వైసీపీ తలుపుల మండల కన్వీనర్ కృష్ణారెడ్డి అలియాస్ డిక్కి బాబును పోలీసులు ఇవాళ(ఆదివారం) అరెస్టు చేశారు. డిక్కీ బాబు నుంచి ఐదు రాగి చెంబులు, రూ.1,10,000 నగదు, మూడు సెల్ ఫోన్లు, ఫార్చునర్ వాహనాన్ని కదిరి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు..
శ్రీ సత్యసాయి జిల్లా , ఫిబ్రవరి 22 (ఆంధ్రజ్యోతి): రైస్ పుల్లింగ్ కేసులో వైసీపీ తలుపుల మండల కన్వీనర్ కృష్ణారెడ్డి అలియాస్ డిక్కి బాబును పోలీసులు ఇవాళ(ఆదివారం) అరెస్టు చేశారు. డిక్కీ బాబు నుంచి ఐదు రాగి చెంబులు, రూ.1,10,000 నగదు, మూడు సెల్ ఫోన్లు, ఫార్చునర్ వాహనాన్ని కదిరి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. రైస్ పుల్లింగ్ పేరుతో వైసీపీ నేత మోసం చేశాడని పోలీసులకు పలువురు బాధితులు ఫిర్యాదు చేశారు. వైసీపీ నేత డిక్కీ బాబు చేతిలో మోసపోయిన తలుపులకు చెందిన బాధితుడు ఫిర్యాదు మేరకు కదిరి పోలీసులు కేసు నమోదు చేశారు. అరెస్ట్ చేసిన అనంతరం అతన్ని రిమాండ్‌కు తరలించారు. కృష్ణారెడ్డి అలియాస్ డిక్కి బాబును జిల్లా బహిష్కరణకు ఎస్పీకి రిపోర్ట్ పంపమని కదిరి డీఎస్పీ శివ నారాయణస్వామి తెలిపారు.
ఈ వార్తలు కూడా చదవండి..
తపాలాశాఖ సేవలను మరువలేం: సీఎం చంద్రబాబు
శ్రీవారి లడ్డూలో నెయ్యికి బదులు రసాయనాలు కలిపారు.. జగన్‌పై మంత్రి నిమ్మల ధ్వజం..
Read Latest Telangana News And AP News And Telugu News