సమాజంలో హిందువుల ఐక్యత కోసమే హిందూ సమ్మేళనం కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు శ్రీకైలసనాథ ఆశ్రమ మాతాజీ భవ్యానందమాతాజీ సోమవారం పేర్కొ న్నారు. మండలపరిధిలోని మునగలవారిపల్లిలో వెలసిన లక్ష్మీ చెన్నకేశ వస్వామి ఆలయంలో సోమవారం హిందూ సమ్మేళనం నిర్వహించారు.
: పట్టణంలోని సర్వేపల్లి రాధాకృష్ణ మున్సిపల్ పాఠశాల విద్యార్థినులు నందిత, రుహానా అంజుమ్ రాష్ట్రస్థాయి సైన్స ఫెయిర్కు ఎంపికయ్యారని హెచఎం శ్రీనివాసులు సోమవారం తెలిపారు.
పాల్తూరు పంచాయతీలోని తమ గ్రామాన్ని విడదీసి పంచాయతీగా ఏర్పాటు చేయాలని గాజుల మల్లాపురం గ్రామస్థులు ఇటీవల డీపీఓకు వినతి పత్రం ఇచ్చారు.
పీఏబీఆర్ కుడికాలువ ద్వారా బత్తలపల్లి, తాడిమ ర్రి మండలాల్లోని చెరువులకు నీరు ఇవ్వాలని సీపీఐ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు సీపీఐ ఆధ్వర్యంలో సోమ వారం స్థానిక ఆర్డీఓ కార్యాలయం వద్ద ధర్నా చేపట్టారు. అనంతరం ఆర్డీఓ మహేశకు వినతిపత్రం అందజేశారు.
ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా మంజూరై చెక్కులను సోమవారం ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్ సోమవారం స్థానిక ఆర్అండ్బి బంగ్లాలో పంపిణీ చేశారు. నియోజక వర్గంలోని 22మందికి మంజూరైన రూ. 12,28,362 లక్షల చెక్కులను అందజేశారు.
గ్రామీణ ఉపాధి హామీ పథ కానికి మహాత్మా గాంధీ పేరును కొనసాగించాలంటూ సీపీఐఎంఎల్, బహుజనసమాజ్ పార్టీ, పీడీఎస్యూ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు వారు సోమవారం పట్టణంలోని గాంధీనగర్ సర్కిల్లోని గాంధీ విగ్రహం ఎదుట ఇనుప గోళాలు తలపై పెట్టుకుని వినూత్న నిరసన తెలిపారు.
తమకు ఎటువంటి జామీన లేకుండా పంట రుణాలు మంజూరు చేయాలని స్థానిక కెనరా బ్యాంక్ ఎ దుట సీపీఐ, సీపీఎం నాయకుల ఆధ్వర్యంలో కౌలు రైతులు సోమ వారం ధర్నా నిర్వహించారు.
అనంతపురం జిల్లాలోని అరవింద్ నగర్ అయ్యప్ప కేఫ్ వద్ద నలుగురు స్నేహితుల మధ్య గొడవ చెరలేగింది. గంజాయి మత్తులో రాజు అనే యువకుడిపై అజయ్తో పాటు మరో ఇద్దరు కత్తితో దాడి చేశారు. రాజు తీవ్రంగా గాయపడ్డాడు.
పంట పెట్టుబడి పేరుతో 43 మంది రైతుల నుంచి రూ. 40.85 లక్షలు అప్పు చేసిన ఓ రైతు పరారయ్యాడు.
హైందన సనాతన ధర్మాని కాపాడుకోవడం ప్రతి హిందు వు కనీస ధర్మమని, ఐకమత్యంతో దాన్ని కాపాడుకోవడానికి ముందుకు రావాలని అంబాత్రయ క్షేత్రం పిఠాధిపతి ఆదిత్య పరాశ్రీ స్వామి సూచించారు.