Share News

EXAMS: ప్రశాంతంగా ఇంటర్‌ పరీక్షలు ప్రారంభం

ABN , Publish Date - Feb 23 , 2026 | 11:28 PM

పట్టణంలో సోమవారం ఇంటర్మీడియట్‌ ప్రథమ సంవత్సర పరీక్షలు ప్రశాంతంగా ప్రారంభమ య్యాయి. ఉరవకొండలోని ప్రభుత్వ బాలుర, బాలికల కళాశాలలో రెండు పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. బాలురు కళాశాలలో 331మంది విద్యార్థులకు గానూ 12మంది గైర్హాజరయ్యారు. 319మంది పరీక్షలకు హాజరయ్యారు.

EXAMS: ప్రశాంతంగా ఇంటర్‌ పరీక్షలు ప్రారంభం
Girl students checking numbers at the exam center in Uravakonda

ఉరవకొండ, ఫిబ్రవరి 23(ఆంధ్రజ్యోతి): పట్టణంలో సోమవారం ఇంటర్మీడియట్‌ ప్రథమ సంవత్సర పరీక్షలు ప్రశాంతంగా ప్రారంభమ య్యాయి. ఉరవకొండలోని ప్రభుత్వ బాలుర, బాలికల కళాశాలలో రెండు పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. బాలురు కళాశాలలో 331మంది విద్యార్థులకు గానూ 12మంది గైర్హాజరయ్యారు. 319మంది పరీక్షలకు హాజరయ్యారు. బాలికల కళాశాలలో 394మంది విద్యార్థులకు గానూ 11మంది గైర్హాజరయ్యారు. 383మంది హాజరయ్యారు. పరీక్ష కేంద్రాలను ఫ్లయింగ్‌ స్క్వాడ్‌ తనిఖీ చేశారు.

గుంతకల్లుటౌన: పట్టణంలో ఇంటర్మీడియట్‌ పరీక్షలు సోమవారం ప్రారంభమయ్యాయి. శ్రీ శంకరనందాగిరిస్వామి జూనియర్‌ కళాశాల, ప్రభుత్వ జూనియర్‌ కళాశాల, నారాయణ, సరస్వతి కళాశాలలో పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. మొత్తం 1797 మంది విద్యార్థులకు గాను 45 మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు అధికారులు తెలిపారు.

గుత్తి: పట్టణంలో ఇంటర్మీడియట్‌ పరీక్షలకు ప్రభుత్వ బాలికల కళాశాల, శ్రీసాయి, మహాత్మా, మోడల్‌ కళాశాలలో పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. మొత్తం 919 మంది విద్యార్థులకు గాను 54 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. పరీక్ష కేంద్రాల వద్ద సీఐ రామారావు ఆధ్వర్యంలో బందోబస్తు ఏర్పాటు చేశారు.


రాయదుర్గంరూరల్‌: పట్టణంలోని మూడు పరీక్ష కేంద్రాలలో మొత్తం 1201 మంది విద్యార్థులకు గాను 1144 మంది పరీక్షకు హాజర య్యారు. 57 మంది గైర్హాజరైనట్లు పరీక్షకేంద్రాల పర్యవేక్షకులు వీరేష్‌, రంజితకుమార్‌, విజయ్‌భాస్కర్‌ తెలిపారు. జూనియర్‌ కళాశాల లో 522 మందికి గాను 493 మంది హాజరయ్యారు. 29 మంది గైర్హాజర య్యారు. బాలికల జూనియర్‌ కళాశాలలో 268 మందికి గాను 254 మంది హాజరయ్యారు. 14 మంది గైర్హాజరయ్యారు. ఏపీ మోడల్‌ కళాశా లలో 411 మందికి గాను 397 మంది హాజరయ్యారు. 14 మంది గైర్హాజరయ్యారు. కళ్యాణదుర్గం డీఎస్పీ ఆదేశాల మేరకు సీఐ జయనాయక్‌ బందోబస్తు నిర్వహించారు.

బొమ్మనహాళ్‌: మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాల లో ఇంటర్‌ ప్రథమ సంవత్సరం పరీక్షలకు మొదటి రోజు 233 మంది విద్యార్థులు హాజరు కావాల్సి ఉండగా 225 మంది హాజరయ్యారు. ఎనిమిది మంది గైర్హాజరైనట్లు సీఎస్‌ హనుమంతనాయక్‌, డిపార్ట మెంటల్‌ అధికారి జ్ఞానేశ్వార్‌ తెలిపారు.

యాడికి: స్థానిక మోడల్‌స్కూల్‌లో మొదటి సంవత్సరం పరీక్షకు మొత్తం ఎనిమిది మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు ప్రిన్సిపాల్‌ ఉష తెలి పారు. మోడల్‌ స్కూల్‌ పరీక్షా కేంద్రంలో రెగ్యులర్‌ విద్యార్థులు 136 మందికిగాను 133మంది హాజరయ్యారు. ముగ్గురు గైర్హాజరయ్యారు. ఒకేషనల్‌కు సంబంధించి 39మందికిగారు 36మంది హాజరయ్యారు. ముగ్గురు గైర్హాజరయ్యారు. సప్లిమెంటరీకి సంబంధించి 11మందికిగాను 9మంది హాజరయ్యారని ఆమె తెలిపారు.


అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....

Updated Date - Feb 23 , 2026 | 11:29 PM