Share News

నీటితొట్టెల బిల్లుల కోసం నిరీక్షణ

ABN , Publish Date - Feb 23 , 2026 | 12:20 AM

ఉపాధి పథకం కింద మండలంలో 51 పశువుల నీటి తొట్టెలను దాదాపు ఎనిమిది నెలల క్రితం నిర్మించారు.

నీటితొట్టెల బిల్లుల కోసం నిరీక్షణ
వెలిచెలమల వద్ద నీటితో నింపిన తొట్టె

నంబులపూలకుంట, ఫిబ్రవరి 22(ఆంధ్రజ్యోతి): ఉపాధి పథకం కింద మండలంలో 51 పశువుల నీటి తొట్టెలను దాదాపు ఎనిమిది నెలల క్రితం నిర్మించారు. ఒక్కో కాంట్రాక్టర్‌ రెండు, మూడు తొట్టెలను నిర్మించాడు. ఒక్కో నీటితొట్టెని రూ.31 వేలతో నిర్మించారు. అయితే వాటికి సంబంధించిన బిల్లులు నేటికీ మంజూరు కాకపోవడంతో వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వేసవిలో సమీపిస్తుండటంతో తాము నిర్మించిన నీటి తొట్టెలు పశువుల దాహార్తిని తీర్చడానికి ఎంతగానో ఉపయోగపడుతున్నామని, తమకు బిల్లులు మంజూరు చేసేలా అధికారులు, పాలకులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఈ మార్చిలో అయినా బిల్లులు ఇవ్వకపోతే తరువాత ఉపాఽధి స్కీం కూడా మారే అవకాశముందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Updated Date - Feb 23 , 2026 | 12:20 AM