Share News

LAWYERS: న్యాయవాదుల విధుల బహిష్కరణ

ABN , Publish Date - Feb 23 , 2026 | 11:38 PM

కర్నూలు బారిస్టర్స్‌ సంఘం సభ్యుడిపై దాడి జరగడం శోచనీయమంటూ స్థానిక జేఎఫ్‌సీ ఎం కోర్టులో న్యాయవాదులు విధులను బహిష్కరించారు. సోమవారం ఉదయం కోర్టులో విధుల నుంచి వైదొలగిన న్యాయవాదులు బైటకు వచ్చి ఆందోళన నిర్వహించారు.

LAWYERS: న్యాయవాదుల విధుల బహిష్కరణ
Lawyers protesting at Guntakallu court

గుంతకల్లు, ఫిబ్రవరి 23 (ఆంధ్రజ్యోతి): కర్నూలు బారిస్టర్స్‌ సంఘం సభ్యుడిపై దాడి జరగడం శోచనీయమంటూ స్థానిక జేఎఫ్‌సీ ఎం కోర్టులో న్యాయవాదులు విధులను బహిష్కరించారు. సోమవారం ఉదయం కోర్టులో విధుల నుంచి వైదొలగిన న్యాయవాదులు బైటకు వచ్చి ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కర్నూలు నాలుగో పట్టణ పోలీసు స్టేషనలో న్యాయవాదిపై సీఐ దాడి చేసిన సంఘటనను ఖండించారు.ఙ గుంతకల్లు బార్‌ అసోసియేషన అధ్యక్షుడు జయరాం, న్యాయవాదులు బీఎస్‌ కృష్ణారెడ్డి, భాస్కర్‌ గౌడు, రమేశ, చెన్నకేశవులు, నాగశేషు, పెద్ద తిమ్మారెడ్డి, ఆర్‌ బడేసాబ్‌, గోపాలకృష్ణ, వెంకట నాయుడు తదితరులు పాల్గొన్నారు.


అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....

Updated Date - Feb 23 , 2026 | 11:38 PM