Share News

డిమాండ్ల సాధనకు అంగనవాడీల రిలే దీక్ష

ABN , Publish Date - Feb 24 , 2026 | 12:49 AM

సమస్యలు పరిష్కరించాలని అంగనవాడీలు సోమ, మంగళవారాల్లో రిలేనిరాహారదీక్షలు చేపట్టాలని ఏపీ అంగనవాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియర్‌ రాష్ట్ర కమిటీ పిలుపునిచ్చింది.

డిమాండ్ల సాధనకు అంగనవాడీల రిలే దీక్ష
ధర్మవరంలో రిలే దీక్షలు చేస్తున్న అంగనవాడీలు, సీఐటీయూ నాయకులు

ధర్మవరం, ఫిబ్రవరి 23(ఆంధ్రజ్యోతి): సమస్యలు పరిష్కరించాలని అంగనవాడీలు సోమ, మంగళవారాల్లో రిలేనిరాహారదీక్షలు చేపట్టాలని ఏపీ అంగనవాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియర్‌ రాష్ట్ర కమిటీ పిలుపునిచ్చింది. ఈ మేరకు స్థానిక సీడీపీఓ కార్యాలయం వద్ద అంగనవాడీలు సోమవారం రిలేనిరాహారదీక్ష చేపట్టారు. బడ్జెట్లో తగినన్ని నిధులు కేటాయించాలని, వేతనాలు పెంచాలని, ఖాళీలను భర్తీ చేయాలని.. డిమాండ్‌ చేశారు. ఇందులో సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు అమూబ్‌ఖాన నాయకులు జేవీరమణ, ఎల్‌ ఆదినారాయణ పాల్గొన్నారు.

Updated Date - Feb 24 , 2026 | 12:49 AM