TANK: శిథిలావస్థలో నీటి ట్యాంక్
ABN , Publish Date - Feb 23 , 2026 | 11:17 PM
పూర్తి గా శిథిలావస్థకు చేరుకున్న తాగునీటి ట్యాంక్ ఎప్పుడు కూలుతుందోనని స్థాని కులు నిత్యం భయాందోళ నతోనే సంచరిస్తున్నారు. మండల కేంద్రమైన కంబదూరు తహసీల్దారు అతిథి గృహం వెనుక ఉన్న తాగునీటి ట్యాంక్ పూర్తిగా శిథిలావస్థకు చేరింది.
కళ్యాణదుర్గం, ఫిబ్రవరి 23(ఆంధ్రజ్యోతి): పూర్తి గా శిథిలావస్థకు చేరుకున్న తాగునీటి ట్యాంక్ ఎప్పుడు కూలుతుందోనని స్థాని కులు నిత్యం భయాందోళ నతోనే సంచరిస్తున్నారు. మండల కేంద్రమైన కంబదూరు తహసీల్దారు అతిథి గృహం వెనుక ఉన్న తాగునీటి ట్యాంక్ పూర్తిగా శిథిలావస్థకు చేరింది. ట్యాంకంతా నెర్రెలు చీలింది. దీంతో ట్యాంకు నుంచి నీరు నిత్యం లీకేజీ అవుతుండడంతో పాచిపట్టింది. ట్యాంకు చుట్టూ సిమెంట్ లేచిపో యి ఇనుప కడ్డీలు కనిపిస్తున్నాయి. ఈ ట్యాంక్ చుట్టూ పలువురు ప క్కాగృహాలు నిర్మించుకుని నివాస ముంటున్నారు. సుమారు పదేళ్లుగా ట్యాంకు శిథిలావస్థకు చేరుకుందని,
సంబంధిత అధికారులు పట్టిం చుకోకుండా చోద్యం చూస్తున్నారని ఆ కాలనీ వాసులు వాపోతున్నారు. ఎన్నోమార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ప్రయోజం లేకుండా పోయిందని వాపోతున్నారు. మండల కేంద్రంలోని ప్ర ధాన రహదారిలోనే ఇంత అధ్వాన్నస్థితికి చేరుకున్న ట్యాంకును గురించి అధికారులు పూర్తిగా విడ్డూరంగా ఉందని వారు విమర్శిస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి ఈ తాగునీటి ట్యాంక్ మరమ్మతులు చేపట్టాలని ఆ కాలనీ ప్రజలు కోరుతున్నారు. ఈ విషయమై ఎంపీడీవో సూర్యనారాయణను వివరణ కోరగా,,, అదనంగా నూతన ట్యాంక్‌ను కంబదూరులో నిర్మిస్తున్నామని తెలిపారు. దాని నిర్మాణం పూర్తయిన వెంటనే శిథిలావస్థకు చేరిన ఈ ట్యాంక్‌ను పరిశీలించి కూల్చివేస్తామని తెలిపారు.
అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....