FAST: సమస్యలను పరిష్కరించాలి
ABN , Publish Date - Feb 23 , 2026 | 11:34 PM
అంగనవాడీ కార్యకర్తలకు కనీస వేతనం అమలు చేయాలని అంగనవాడీ వర్కర్స్, హెల్పెర్స్ యూనియన ఆధ్యక్ష, కార్యదర్శులు గోవిందమ్మ, మేరీ, సీఐటీ యూ నాయకుడు మల్లికార్జున డిమాండ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా తలపెట్టిన రెండురోజుల రిలే నిరాహార దీక్షల్లో భాగంగా పట్టణంలోని ఐసీడీఎస్ కార్యాలయం వద్ద సీఐటీయూ ఆధ్వర్యంలో అంగనవాడీ కార్యకర్తలు సోమవారం రిలే నిరాహర దీక్షలు చేప ట్టారు.
-అంగనవాడీ కార్యకర్తల డిమాండ్
- రిలే నిరాహర దీక్షలు
రాయదుర్గం రూరల్, ఫిబ్రవరి 23(ఆంధ్రజ్యోతి): అంగనవాడీ కార్యకర్తలకు కనీస వేతనం అమలు చేయాలని అంగనవాడీ వర్కర్స్, హెల్పెర్స్ యూనియన ఆధ్యక్ష, కార్యదర్శులు గోవిందమ్మ, మేరీ, సీఐటీ యూ నాయకుడు మల్లికార్జున డిమాండ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా తలపెట్టిన రెండురోజుల రిలే నిరాహార దీక్షల్లో భాగంగా పట్టణంలోని ఐసీడీఎస్ కార్యాలయం వద్ద సీఐటీయూ ఆధ్వర్యంలో అంగనవాడీ కార్యకర్తలు సోమవారం రిలే నిరాహర దీక్షలు చేప ట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గతంలో ఇచ్చిన హామీ మేరకు అంగన వాడీ కార్యకర్తలకు కనీస వేతనం రూ. 26వేలు ఇవ్వాలని, గ్రాట్యుటీ అమలు చేయాలని,
పెండింగ్‌లో ఉన్న 164 సుప్రవైజర్ పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో యూనియన కోశాధికారి రాధమ్మ, సెక్టర్ లీడర్లు రాధిక, నెహ్రున, అనురాధ, లలిత, గుమ్మఘట్ట, డీ. హీరేహాళ్, రాయదుర్గం మండలాల అంగనవాడీ కార్యకర్తలు, ఆయాలు పాల్గొన్నారు.
గుత్తి: సీఐటీయూ ఆధ్వర్యంలో స్థానిక ఐసీడీఎస్ ప్రాజెక్టు కార్యాల యం వద్ద అంగనవాడీ వర్కర్లు చేపట్టిన రిలే నిరాహార దీక్షల్లో సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు రమేష్, అంగనవాడీ ప్రాజెక్టు కార్యదర్శి రేష్మా, వ్యవసాయ కార్మిక సంఘం మండల కార్యదర్శి మల్లేష్, యూనియన నాయకులు గంగమ్మ, కల్యాణి, జయంతి, మహాలక్ష్మి, శోభ తదితరులు పాల్గొన్నారు.
కణేకల్లు: అంగనవాడీ వర్కర్లు ఐసీడీఎస్ స్థానిక కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. అంగనవాడీ వర్కర్లు సంఘం నాయకు రాళ్లు పార్వతి, రామాంజినమ్మ, యశోద, స్వర్ణలత, లక్ష్మి, సునీత, అప్రోజ్ త దితరులు పాల్గొన్నారు.
తాడిపత్రి: అంగనవాడీ వర్కర్లు స్థానిక తహసీల్దార్ కార్యాలయం వద్ద చేపట్టిన దీక్షల్లో ముఖ్యఅతిథిగా ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు రాజేష్‌గౌడ్ హాజరయ్యారు. దీక్షల్లో సీపీఐ నియోజకవర్గ కార్యదర్శి రంగయ్య, పట్టణ కార్యదర్శి చిరంజీవి, అంగనవాడీ వర్కర్స్, హెల్పర్స్ యూనియన నాయకురాళ్లు జ్యోతిలత, నాగేశ్వరమ్మ, శంకరమ్మ తదితరులు పాల్గొన్నారు.
అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....