పుట్టపర్తి సత్యసాయి బాబా శత జయంతి వేడుకల సందర్భంగా ఏపీ ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ఈ వేడుకల్లో ప్రధానమంత్రి నరేంద్రమోదీ పాల్గొననున్నారు. ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసింది.
సహకార సంఘాలను మరిం త బలోపేతం చేయాలంటూ జిల్లా ఇనచార్జి ఆదినారాయణ సూచించా రు. స్థానిక ఎనుములపల్లి వ్యవసాయ సహకార సంఘంలో ఆదివారం 72వ అఖిల భారత సహకార సంఘాల వారోత్సవాలు జరుపుకున్నారు. జిల్లా ఇనచార్జి జెండా ఆవిష్కరించి, సొసైటీ అధ్యక్షుడు ఉమ్మినేని వెంకటరాముడు అధ్యక్షతన సమావేశం నిర్వహించారు.
సత్యసాయిబాబా శతజయంతి సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఈ నెల 19న పుట్టపర్తికి రానున్న నేపథ్యంలో అధికారులు ఏర్పాట్లను ముమ్మ రం చేశారు. ఆదివారం రాత్రి రాష్ట్ర వైద్యఆరోగ్యశాఖ కమిషనర్ ప్రధానమంత్రి పర్యటన ఏర్పాట్ల సమన్వయ అధికారి వీరపాండ్యన పుట్టపర్తికి చేరుకున్నారు.
సత్యసాయిబాబా శతజయంతి ఉత్సవాల పురస్కరించుకుని ఈనెల19న ప్రశాంతినిల యానికి వస్తున్న ప్రధాని నరేంద్రమోదీ పర్యటనకు పటిష్ట బందోబస్తు ఏర్పాటుచేసినట్టు అనంతపురం రేంజ్ డీఐజీ షిమోషి, ఎస్పీ సతీష్ కుమార్ పేర్కొన్నారు. ఆదివారం రాత్రి జిల్లా పోలీసుకార్యాలయంలోని పోలీసుకమాండ్ కంట్రోల్ రూం ఆవరణలో బందోబస్తు నిమిత్తం వ చ్చిన 17 జిల్లాల పోలీసు అధికారులకు బందోబస్తు ఏర్పాట్లపై దిశాని ర్దేశం చేశారు.
సత్యసాయిబాబా శతజయంతి ఉత్సవాల నేపథ్యంలో పుట్టపర్తి ప్రాంతంలో ఆద్యాత్మిక వా తావరణం నెలకొల్పేందుకు మైకుల ద్వారా సత్యసాయి దివ్యనామస్మరణ చాంటింగ్ను ఎమ్యెల్యే సింధూరరెడ్డి, మాజీమంత్రి పల్లె రఘునాథరెడ్డి ప్రారంబించారు. స్థానిక కలెక్టరేట్ ఎదురుగా ఉన్న మహిళా పోలీసు స్టేషన ప్రాంగణంలో ఆదివారం వారు చాంటింగ్ కార్యక్రమాన్ని ప్రారం భించారు.
వైసీపీ హయాంలో ప్రజాధనాన్ని ఇష్టారాజ్యంగా వృథా చేశారనేందుకు నిదర్శనమే ఈ జగనన్న కాలనీ. అధికారులు, ప్రజాప్రతినిధులు అనాలోచిత నిర్ణయాలతో జగనన్న కాలనీ అడవిని తలపిస్తోంది. తనకల్లు మేజర్ పంచాయతీ పరిధిలోని 30 పల్లెల లబ్ధిదారులకు జగనన్న కాలనీ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. అందులో 140 మందికి పట్టాలు ఇచ్చారు.
టీటీడీ మాజీ ఏవీఎస్వో, జీఆర్పీ సీఐ సతీశ్ కుమార్ అనుమానాస్పద మృతి నేపథ్యంలో ఆదివారం నాడు సీన్ రీకన్స్ట్రక్షన్ జరిగింది. చెన్నై- ఎగ్మోర్ ఎక్స్ప్రెస్(22157) రైలులో పోలీసులు సీన్ రీకన్స్ట్రక్షన్ చేశారు.
హిందూపురం అభివృద్ధిపై తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ స్పెషల్ ఫోకస్ పెట్టారు. ఇందులో భాగంగానే పలు కార్యక్రమాల్లో బాలయ్య పాల్గొన్నారు.
టీటీడీ మాజీ ఏవీఎస్వో, ఇన్స్పెక్టర్ సతీశ్ కుమార్ కేసులో పలు కోణాల్లో అనంతపురం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఆయన మృతిపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ క్రమంలో పోలీసులు ప్రతి విషయాన్ని నిశితంగా పరిశీలిస్తున్నారు.
మండల పరిధిలోని గౌళ్లపల్లికి విద్యుత అధికారులు ఎన్నో యేళ్లక్రితమే విద్యుత సౌకర్యం క ల్పించారు. గ్రామంలోకి మూడు వైర్లుతో విద్యుత సరఫరా అందిస్తున్నారు. అయితే గ్రామం సమీపంలో ఆ మూడు విద్యుత వైర్లకు ప చ్చని తీగలు పూర్తిగా అల్లుకుపోయాయి. వైర్ల మొత్తం కిందికి లా గేస్తున్నాయి. అయినా విద్యుత అధికారులు ఆ వైపు కన్నెతి చూసిన పాపాన పోలేదు.