Share News

CANAL: నీటి ప్రవాహానికి సహకరించాలి : డీఈ

ABN , Publish Date - Feb 05 , 2026 | 12:02 AM

పీఏబీఆర్‌ కుడికాలువ కింద ఉన్న చెరువులకు నీరందించేం దుకు ప్రభుత్వం ప్రణాళిక బద్ధంగా వ్యవహరిస్తోందని నీటి పారుదల శాఖ డీఈ ఈ చంద్రశేఖర్‌, ఏఈఈ ఓ బుళపతి అన్నారు. నీరు స జావుగా ప్రవహించేందుకు రైతులు సహకరించాలని కోరారు.

CANAL: నీటి ప్రవాహానికి సహకరించాలి : డీఈ
Officials inspecting the water flow

తాడిమర్రి, ఫిబ్రవరి 4(ఆంధ్రజ్యోతి): పీఏబీఆర్‌ కుడికాలువ కింద ఉన్న చెరువులకు నీరందించేం దుకు ప్రభుత్వం ప్రణాళిక బద్ధంగా వ్యవహరిస్తోందని నీటి పారుదల శాఖ డీఈ ఈ చంద్రశేఖర్‌, ఏఈఈ ఓ బుళపతి అన్నారు. నీరు స జావుగా ప్రవహించేందుకు రైతులు సహకరించాలని కోరారు. మండలంలోని పు ల్లంపల్లి వద్ద నీటిప్రవాహాన్ని వారు బుధవారం పరిశీలించారు. రైతులు ఎక్కడా కూడా అడ్డుకట్టవేయకుండా నీరు సజావుగా చివరి చెరువులకు వెళ్లేందుకు సహకరించాలని వారు సూచించారు. ఇప్పటికే అగ్రహారం చెరువుకు నీటి కేటాయింపు పూర్తి అయిందని, తాడిమర్రిచెరువుకు నీటి పంపిణీ జరుగుతోంద న్నారు. నీటి పారుదలశాఖ అధికారులందరూ విడతల వారీగా కాలువపై పర్యటిస్తూ ఎక్కడా నీటి చౌర్యం జరగకుండా చూస్తున్నామని తెలిపారు. ఏఈ రమణారెడ్డి, రైతులు పాల్గొన్నారు.


అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....

Updated Date - Feb 05 , 2026 | 12:03 AM