Share News

నెట్టికంటికి రూ. 25 లక్షల స్థలం అందజేత

ABN , Publish Date - Feb 05 , 2026 | 11:21 PM

కసాపురం శ్రీ నెట్టికంటి ఆంజనేయస్వామి దేవస్థానానికి పట్టణానికి చెందిన పువ్వాడ చంద్రశేఖర్‌, ఆయన కుమారులు శ్రీనివాసులు, గురుప్రసాద్‌ రూ. 25 లక్షల విలువ చేసే 269.35 గజాల స్థలాన్ని అందజేశారు.

నెట్టికంటికి రూ. 25 లక్షల స్థలం అందజేత
ఈఓకు పత్రాలను అందజేస్తున్న శ్రీనివాసులు, గురుప్రసాద్‌

గుంతకల్లుటౌన, ఫిబ్రవరి 5(ఆంధ్రజ్యోతి): కసాపురం శ్రీ నెట్టికంటి ఆంజనేయస్వామి దేవస్థానానికి పట్టణానికి చెందిన పువ్వాడ చంద్రశేఖర్‌, ఆయన కుమారులు శ్రీనివాసులు, గురుప్రసాద్‌ రూ. 25 లక్షల విలువ చేసే 269.35 గజాల స్థలాన్ని అందజేశారు. కసాపురం ఆలయం పేరట రిజిస్ట్రేషన చేయించిన పత్రాలను ఆలయ ఈఓ మేడేపల్లి విజయరాజుకు గురువారం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ ప్రధాన అర్చకుడు రాఘవచార్యులు, ఉపప్రధాన అర్చకుడు ప్రశాంత, ఏఈఓ వెంకటేశ్వరుడు, గ్రామ పెద్దలు హనుమన్న, మనోహర్‌, ప్రసాద్‌రెడ్డి, తిక్కస్వామి, రామాంజినేయులు పాల్గొన్నారు.

Updated Date - Feb 05 , 2026 | 11:21 PM